ఇంగ్లండ్​తో మ్యాచ్​కు ముందు గిల్ వార్నింగ్.. బయటకు తీస్తానంటూ..!

  • Author singhj Updated - 07:05 PM, Thu - 26 October 23

వరుస విజయాలతో దూసుకెళ్తున్న రోహిత్ సేన.. నెక్ట్స్ మ్యాచ్​లో ఇంగ్లండ్​ను ఢీకొట్టేందుకు రెడీ అవుతోంది. కీలకమైన ఈ మ్యాచ్​కు ముందు టీమిండియా ఓపెనర్ శుబ్​మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

వరుస విజయాలతో దూసుకెళ్తున్న రోహిత్ సేన.. నెక్ట్స్ మ్యాచ్​లో ఇంగ్లండ్​ను ఢీకొట్టేందుకు రెడీ అవుతోంది. కీలకమైన ఈ మ్యాచ్​కు ముందు టీమిండియా ఓపెనర్ శుబ్​మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

  • Author singhj Updated - 07:05 PM, Thu - 26 October 23

భారత స్టార్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ వన్డే వరల్డ్ కప్-2023లో ఫుల్ స్వింగ్​లో ఉన్నాడు. భారీ స్కోర్లు బాదకపోయినా ఆడినంత సేపు అటాకింగ్ గేమ్​తో అదరగొడుతున్నాడు. డెంగ్యూ కారణంగా మెగా టోర్నీలోని తొలి రెండు మ్యాచులకు దూరమైన ఈ యంగ్ ఓపెనర్ పాకిస్థాన్​తో ఆడాడు. ఆ మ్యాచ్​లో 11 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 16 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. బంగ్లాదేశ్​తో జరిగిన నెక్స్ట్ మ్యాచ్​లో గిల్ (53) హాఫ్ సెంచరీ కొట్టాడు. న్యూజిలాండ్ మీద కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి ఫస్ట్ వికెట్​కు 71 రన్స్ జోడించి మంచి స్టార్ట్ అందించాడు. ఈ మ్యాచ్​లో 31 బంతుల్లో ఐదు ఫోర్ల సాయంతో 26 రన్స్ చేశాడు. ఈ వరల్డ్ కప్​లో ఇప్పటిదాకా గిల్​ నుంచి తన రేంజ్​కు తగ్గ ఇన్నింగ్స్ రాలేదు.

నెక్స్ట్ ఇంగ్లండ్​తో మ్యాచ్​కు రెడీ అవుతున్న గిల్ తన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్​పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తనలోని అసలైన టాలెంట్​ను దాచి పెట్టానని.. ఇప్పుడు బయటకు తీయాల్సిన టైమ్ వచ్చిందన్నాడు. ఇన్నాళ్లూ తాను చేసిందంతా 90 శాతమేనని.. ఇంకా 100 పర్సెంట్ ఎవరూ చూడలేదని వ్యాఖ్యానించాడు గిల్. మున్ముందు మరింత క్వాలిటీ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. అయితే ఇది కేవలం భారీ స్కోర్ల గురించే కాదని.. తన గేమ్, పర్సనాలిటీ కూడా ఇందులో ఉంటాయని తెలిపాడు గిల్. ఏ మ్యాచ్​లోనైనా సరే ఒక భారీ ఇన్నింగ్స్ ఆడితే దాని వల్ల టీమ్​కు కలిగే బెనిఫిట్ ఏంటనేదీ ఆలోచించాలన్నాడు.

మంచి ఇన్నింగ్స్​ల వల్ల స్వలాభం కాకుండా టీమ్​కు ఉపయోగపడుతుందా అనేది ఆలోచిచండం బెటర్ అన్నాడు గిల్. ఇలా చేయడం వల్ల రిజల్ట్ మీద కూడా ఎఫెక్ట్ తప్పకుండా చూపిస్తుందన్నాడు. ఇక, ఈ ఏడాది ఐపీఎల్​లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్​గా గిల్ రికార్డు సృష్టించాడు. మొత్తం 17 మ్యాచుల్లో 890 రన్స్ చేశాడు. ఇదే సీజన్​లో వన్డేల్లో 23 మ్యాచుల్లో 1,325 రన్స్ చేసిన గిల్.. అత్యంత వేగంగా వెయ్యి రన్స్ మార్క్​ను చేరుకున్న రెండో టీమిండియా బ్యాటర్​గా నిలిచాడు. మరి.. వరల్డ్ కప్ సెకండాఫ్​లో గిల్​ తన బెస్ట్ ఇస్తాడనుకుంటే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: డేవిడ్ వార్నర్ బీస్ట్ బ్యాటింగ్! గంగూలీని గుర్తు చేస్తూ!

Show comments