వీడియో: ఎయిర్‌ పోర్ట్‌లో కొత్త టీ20 కెప్టెన్‌ సూర్యను చూసి పాండ్యా రియాక్షన్‌ ఇదే!

Hardik Pandya, Suryakumar Yadav, IND vs SL: శ్రీలంక పర్యటను వెళ్లే ముందు.. కొత్త టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను ముంబై ఎయిర్‌ పోర్ట్‌లో చూసిన హార్ధిక్‌ పాండ్యా ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

Hardik Pandya, Suryakumar Yadav, IND vs SL: శ్రీలంక పర్యటను వెళ్లే ముందు.. కొత్త టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను ముంబై ఎయిర్‌ పోర్ట్‌లో చూసిన హార్ధిక్‌ పాండ్యా ఏం చేశాడో ఇప్పుడు చూద్దాం..

రోహిత్‌ శర్మ తర్వాత టీమిండియా టీ20 కెప్టెన్‌గా హార్ధిక్‌ పాండ్యా అవుతాడని అంతా భావించారు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో అద్భుతమైన ప్రదర్శన చేసిన తర్వాత కూడా.. పాండ్యాకు కెప్టెన్సీ దక్కకపోగా.. ఉన్న వైస్‌ కెప్టెన్సీ కూడా ఊడిపోయింది. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 విన్నింగ్‌ టీమ్‌కు వైస్‌ కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్‌ పాండ్యా ఇప్పుడు టీమిండియాలో ఒక ఆల్‌రౌండర్‌ మాత్రమే. అతని స్థానంలో శుబ్‌మన్‌ గిల్‌కు వైస్‌ కెప్టెన్సీ, రోహిత్‌ స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం అంతా ముగిసిన తర్వాత.. తాజాగా టీమిండియా శ్రీలంక పర్యటనకు బయలుదేరి వెళ్లింది.

సోమవారం ముంబైలో కొత్త హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌, చీఫ్‌ సెలెక్టర్‌ ప్రెస్‌ కాన్ఫిరెన్స్‌ తర్వాత యంగ్‌ టీమిండియా శ్రీలంకకు బయలుదేరి వెళ్లింది. ఆటగాళ్లంతా ఒక్కొక్కళ్లుగా ఎయిర్‌ పోర్టుకు చేరుకున్నారు. కొత్తగా టీ20 కెప్టెన్‌ అయిన సూర్యకుమార్‌ యాదవ్‌ ముందుగానే ఎయిర్‌ పోర్టుకు వచ్చి లాంజ్‌లో కూర్చోని ఉన్నాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన హార్ధిక్‌ పాండ్యా వెంటనే సూర్య వద్దకు వెళ్లాడు. పాండ్యా రాకను గమనించి సూర్య.. వెంటనే లేచి.. పాండ్యాను హగ్‌ చేసుకున్నాడు. ఇద్దరు ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.

హార్ధిక్‌ పాండ్యా.. సూర్యకు కంగ్రాట్స్‌ చెప్పాడు. అందుకు సూర్య థ్యాంక్స్‌ చెప్పాడు. ఇలా ఇద్దరు ఆటగాళ్లు ఎలాంటి ఈగో లేకుండా ఎంతో ఆప్యాయంగా పలకరించుకోవడంతో క్రికెట్‌ అభిమానులు హ్యాపీగా ఫీల్‌ అవుతున్నారు. తనకు దక్కని కెప్టెన్సీ సూర్యకుమార్‌ యాదవ్‌కు దక్కిందని.. పాండ్యాలో ఎలాంటి కోపం, అసూయ లేదని ఈ ఎంట్రాక్షన్‌తో తేలిపోయిందంటూ క్రికెట్‌ అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా వాళ్లిద్దరూ కౌగిలించుకున్న ఫొటో, వీడియోలను షేర్‌ చేస్తున్నారు. కెప్టెన్సీ ఇద్దరు మంచి క్రికెటర్ల మధ్య విభేదాలు తేనందుకు.. ఇద్దరు ఆటగాళ్లను భారత క్రికెట్‌ అభిమానులు అభినందిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments