సచిన్, సెహ్వాగ్ కాదు.. ధోనీనే తన ఫేవరెట్ అంటున్న గంభీర్!

  • Author singhj Published - 11:07 AM, Thu - 23 November 23

సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ కాదు.. తన ఫేవరెట్ మహేంద్ర సింగ్ ధోనీనే అని మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అంటున్నాడు.

సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ కాదు.. తన ఫేవరెట్ మహేంద్ర సింగ్ ధోనీనే అని మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ అంటున్నాడు.

  • Author singhj Published - 11:07 AM, Thu - 23 November 23

రీసెంట్​గా ముగిసిన వన్డే వరల్డ్ కప్-2023లో ఆఖరి మెట్టుపై బోల్తా పడింది టీమిండియా. మొదటి మ్యాచ్ నుంచి న్యూజిలాండ్​తో ఆడిన నాకౌట్ మ్యాచ్ దాకా అన్నింటా భారత్​దే ఆధిపత్యం. గ్రౌండ్​లో ఎదురొచ్చిన ప్రతి అపోజిషన్ టీమ్​ను కుమ్మేసింది రోహిత్ సేన. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్​లో ఫుల్ డామినేషన్ చూపిస్తూ కనికరం లేకుండా ప్రత్యర్థులను చిత్తు చేస్తూ పోయింది. ఇదే గేమ్​ను ఆస్ట్రేలియాతో ఫైనల్ మ్యాచ్​లోనూ కంటిన్యూ చేస్తే విజయం మన సొంతమయ్యేది. కానీ చివరి మెట్టుపై బోల్తా పడిన భారత్.. ప్రతిష్టాత్మకమైన ప్రపంచ కప్​ను మిస్ చేసుకుంది. టాస్ దగ్గర నుంచి విన్నింగ్ రన్ కొట్టేంత వరకు ఈ మ్యాచ్​లో ఆసీస్ డామినేషన్ నడిచింది.

రోహిత్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు, జస్​ప్రీత్ బుమ్రా-మహ్మద్ షమి ఫస్ట్ స్పెల్ టైమ్​లో తప్పితే మ్యాచ్ మొత్తం ఆస్ట్రేలియా ఆధిపత్యమే నడిచింది. ఫైనల్లో ఎలా ఆడాలి, ప్రెజర్​ను తట్టుకొని బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఇవ్వాలో మరోమారు చూపించింది కమిన్స్ సేన. అయితే కంగారూ టీమ్ వరల్డ్ కప్ నెగ్గడంపై మాజీ ఆటగాళ్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బెస్ట్ టీమ్ అయిన టీమిండియాకు కప్పు దక్కలేదని.. మెగా టోర్నీలో భారతే బెస్ట్ అని అంటున్నారు. మహ్మద్ కైఫ్ సహా మరికొంత మంది సీనియర్ ప్లేయర్స్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వాదనతో భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ఏకీభవించలేదు. ఇది కరెక్ట్ కాదని.. బెస్ట్ టీమే విశ్వ విజేతగా నిలిచిందన్నాడు.

‘ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు గానీ బెస్ట్ టీమ్ వరల్డ్ కప్ గెలిచింది. అత్యుత్తమ జట్టు వరల్డ్ కప్ నెగ్గలేదని కొంతమంది అనలిస్టులు చెప్పడం నేను విన్నా. కానీ బెస్ట్ టీమే ప్రపంచ కప్ గెలిచింది. ఈ విషయంలో నిజాయితీగా మాట్లాడుకుందాం.. టీమిండియా 10 మ్యాచ్​లు గెలిచి సూపర్ ఫామ్​లో ఉంది. కాబట్టి ఫైనల్లో వాళ్లు ఫేవరెట్స్​గా బరిలోకి దిగారు. కానీ, మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత వరుసగా ఎనిమిది విక్టరీలు అందుకొంది. పది మ్యాచులు గెలిచిన భారత్.. ఈ ఒక్క మ్యాచ్​లో పేలవంగా ఆడింది. మన టీమ్ బాగా ఆడలేదు. లీగ్ స్టేజ్​లో ఫస్ట్ ప్లేస్​లో నిలిచామా లేదా నాలుగో స్థానంలో ఉన్నామా అనేది ముఖ్యం కాదు’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ఇక, భారత్​కు సుదీర్ఘ కాలం సేవలు అందించిన గంభీర్.. ఈ క్రమంలో చాలా మంది లెజెండ్స్​తో కలసి ఆడాడు.

సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని లాంటి దిగ్గజాలతో కలసి బ్యాటింగ్​ చేశాడు గౌతీ. అయితే ఎక్కువగా సెహ్వాగ్​తో కలసి ఓపెనింగ్​ చేశాడు గంభీర్. వీళ్లిద్దరూ ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడుతూ అపోజిషన్ టీమ్స్​ను పోయించేవారు. ఈ నేపథ్యంలో గంభీర్ ఫేవరెట్ పార్ట్​నర్ సెహ్వాగ్ అని చాలా మంది అంటుంటారు. అయితే ఈ విషయంపై అతడు క్లారిటీ ఇచ్చాడు. ‘నా ఫేవరెట్ బ్యాటింగ్ పార్ట్​నర్ ఎంఎస్ ధోనీనే. చాలా మంది సెహ్వాగ్ నా ఫేవరెట్ అనుకుంటారు. కానీ ధోనీతో కలసి వైట్ బాల్ క్రికెట్​లో ఆడటాన్ని నేను బాగా ఆస్వాదించా. మేం ఇద్దరం కలసి ఎన్నో భారీ భాగస్వామ్యాలు నెలకొల్పాం’ అని గంభీర్ వ్యాఖ్యానించాడు. మరి.. ధోనీనే తన ఫేవరెట్ అంటూ గౌతీ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సంజూ శాంసన్​కు ఇన్ని కష్టాలు ఎందుకు? అతడ్ని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Show comments