Nidhan
Suryakumar Yadav: టీమిండియా టీ20 నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ అసైన్‌మెంట్‌కు రెడీ అవుతున్నాడు. ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత తొలి సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు.
Suryakumar Yadav: టీమిండియా టీ20 నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ అసైన్‌మెంట్‌కు రెడీ అవుతున్నాడు. ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత తొలి సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు.
Nidhan
టీమిండియా టీ20 నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ అసైన్‌మెంట్‌కు రెడీ అవుతున్నాడు. ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా జట్టు పగ్గాలు చేపట్టిన తర్వాత తొలి సిరీస్‌కు సిద్ధమవుతున్నాడు. శ్రీలంకతో రేపటి నుంచి జరగబోయే మూడు టీ20ల సిరీస్ కోసం అతడి సారథ్యంలోని మెన్ ఇన్ బ్లూ సన్నద్ధమవుతోంది. టీ20 ప్రపంచ కప్-2026 మిషన్ ఈ సిరీస్ నుంచే మొదలవనుంది. అందుకే ఇక మీదట ఆడే ప్రతి సిరీస్, ప్రతి మ్యాచ్ టీమిండియాకు కీలకం కానుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా లాంటి సీనియర్లు పొట్టి ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పినందున టీమ్ కాంబినేషన్‌ను సెట్ చేసుకోవాలి. ఏయే ప్లేయర్లు ఎక్కడెక్కడ ఆడాలనేది క్లారిటీ రావాలి. రిజర్వ్ బెంచ్‌ను మరింత పటిష్టం చేసుకోవాలి. కాబట్టి ఈ సిరీస్‌ను సూర్యకుమార్ ఫుల్‌గా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది.
కొత్త కోచ్ గౌతం గంభీర్ సహకారంతో విన్నింగ్ స్ట్రీక్‌ను మెయింటెయిన్ చేయాలని చూస్తున్నాడు సారథి సూర్య. అందుబాటులో ఉన్న వనరులను ఉపయోగించుకొని లంకను వైట్‌వాష్ చేయాలని భావిస్తున్నాడు. ఇప్పటికే టీమ్ ముమ్మరంగా సాధన చేస్తోంది. ఆటగాళ్లంతా నెట్స్‌లో తీవ్రంగా చెమటోడ్చుతున్నారు. లంక బెండు తీయాలని డిసైడ్ అయ్యారు. ఈ సందర్భంగా మిస్టర్ 360 ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. కెప్టెన్సీ రెస్పాన్సిబిలిటీని తాను ఆస్వాదిస్తున్నానని అన్నాడు. హెడ్ కోచ్ గంభీర్‌తో తనది స్పెషల్ బాండ్ అని చెప్పాడు. తన సక్సెస్ సీక్రెట్ ఏంటో గౌతీకి మాత్రమే తెలుసునని.. ఆయన మామూలోడు కాదన్నాడు స్కై.
‘కోచ్ గంభీర్‌తో నా అనుబంధం చాలా స్పెషల్. 2014లో ఆయన కెప్టెన్సీలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ఆడా. అక్కడి నుంచి నా కెరీర్ టర్న్ అయింది. నాకు మెరుగైన ఛాన్సులు లభించాయి. మా బంధం ఇప్పటికి కూడా అంతే బలంగా ఉంది. నేను ఎలా ఆడతానో ఆయనకు తెలుసు. నా మైండ్‌సెట్ ఎలా ఉంటుంది? ఎలా ఆలోచిస్తాననే సీక్రెట్ కూడా ఆయనకు తెలుసు’ అని సూర్యకుమార్ చెప్పుకొచ్చాడు. కోచ్‌గా గంభీర్ ఎలా పని చేస్తాడనేది తనకు తెలుసునని.. తమ కాంబోలో బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని భావిస్తున్నానని పేర్కొన్నాడు. కెప్టెన్సీ ఛాన్స్ రావడం హ్యాపీగా ఉందని.. ఈ బాధ్యతను నిలబెట్టుకునేందుకు అహర్నిషలు శ్రమిస్తానని వ్యాఖ్యానించాడు. మరి.. సూర్య-గౌతీ కాంబో సక్సెస్ అవుతుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.
SURYAKUMAR YADAV – CAPTAIN OF TEAM INDIA IN T20IS…!!! 🇮🇳pic.twitter.com/TzLLjZjzUJ
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 26, 2024