గంభీర్ ఇక మారవా? కోహ్లీపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన మాజీ ఓపెనర్!

  • Author Soma Sekhar Published - 04:14 PM, Tue - 12 September 23
  • Author Soma Sekhar Published - 04:14 PM, Tue - 12 September 23
గంభీర్ ఇక మారవా? కోహ్లీపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన మాజీ ఓపెనర్!

సాధారణంగా క్రికెట్ లో ప్రత్యర్థి ఆటగాళ్ల మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని కొన్ని జట్లలో ఉన్న ఆటగాళ్లకు సొంత టీమ్ మెంబర్స్ అంటే ఇష్టం ఉండదు. దాంతో అతడిపై సందర్భం వచ్చినప్పుడల్లా విమర్శలు చేస్తూ ఉంటారు వేరే ఆటగాళ్లు. ఇక టీమిండియాలో గౌతమ్ గంభీర్ కు ధోని అన్నా.. విరాట్ కోహ్లీ అన్నా పడదు అన్న విషయం మనందరకు తెలిసిందే. టైమ్ దొరికినప్పుడల్లా ధోనిని, విరాట్ ను విమర్శించడమే పనిగా పెట్టుకుంటూ ఉంటాడు. తాజాగా విరాట్ కోహ్లీపై తన అక్కసును మరోసారి వెళ్లగక్కాడు గౌతమ్ గంభీర్. ఆసియా కప్ లో భాగంగా సోమవారం పాకిస్థాన్ తో జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో టీమిండియా 228 పరుగుల తేడాతో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీలతో చెలరేగారు. కాగా ఈ మ్యాచ్ లో కింగ్ విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దాంతో ఈ అవార్డుకు అర్హుడు కోహ్లీ కాదు.. అతడే అంటూ గంభీర్ చెప్పుకొచ్చాడు.

ఆసియా కప్ సూపర్ 4లో భాగంగా పాక్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 228 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ఫైనల్ రేసులో నిలిచింది భారత జట్టు. ఇక ఈ మ్యాచ్ లో అద్భుతమై సెంచరీలతో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ చెలరేగగా.. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో సత్తా చాటాడు. సూపర్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అయితే ఈ అవార్డుకు సరైన వ్యక్తి కోహ్లీ కాదని గౌతమ్ గంభీర్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్ అనంతరం గౌతమ్ గంభీర్ మాట్లాడాడు. పాక్ తో మ్యాచ్ లో ఏ ప్లేయర్ బాగా ఆడాడు అని విలేకరి ప్రశ్నించగా.. గౌతమ్ గంభీర్ సమాధానం ఇస్తూ..

“ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ బాగా ఆడాడు. పాక్ పై తొలిసారి 5 వికెట్లు తీశాడు. ఇక స్పిన్ ను ధీటుగా ఎదుర్కొనే పాక్ బ్యాటర్లను కుల్దీప్ తన స్పిన్ ఉచ్చులో పడేశాడు. కాబట్టి నేనైతే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కోహ్లీకి బదులుగా కుల్దీప్ ను ఎంపిక చేస్తాను” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో మరోసారి విరాట్ పై తన అక్కసును వెళ్లగక్కాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు కోహ్లీ ఫ్యాన్స్. గంభీర్ ఇక నువ్వు మారవా? అంటూ విరాట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా గంభీర్ ను ఏకిపారేస్తున్నారు. అయితే విరాట్, రాహుల్ సెంచరీలు చేసిన సంగతి తనకు తెసుసని, రోహిత్, గిల్ లు కూడా అద్భుతంగా ఆడారని గంభీర్ తెలిపాడు.

కానీ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలమైన పిచ్ పై 8 ఓవర్లలో కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీయడం ఎంతో గొప్ప అని చెప్పుకొచ్చాడు గంభీర్. అయితే ఈ 5 వికెట్లు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లపై తీస్తే.. నేను అంతగా ప్రశంసించే వాడిని కాదు. ఎందుకంటే వారికి స్పిన్ ఆడరాదని అందరికి తెలుసు అంటూ తన వాదనను సమర్థించుకున్నాడు గౌతమ్. కాగా.. గంభీర్ వ్యాఖ్యలపై క్రికెట్ ఫ్యాన్స్ తో పాటుగా విరాట్ అభిమానులు మండిపడుతున్నారు. విరాట్ ఫామ్ చూసి ఓర్వలేకపోతున్నాడు అంటూ గౌతమ్ గంభీర్ ను విమర్శిస్తున్నారు. మరి విరాట్ కోహ్లీపై గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments