Somesekhar
ఈ ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ వరుస పరాజయాలతో దారుణంగా విమర్శలపాలవుతోంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. అదేంటంటే?
ఈ ఐపీఎల్ సీజన్ లో ఆర్సీబీ వరుస పరాజయాలతో దారుణంగా విమర్శలపాలవుతోంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కు ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. అదేంటంటే?
Somesekhar
ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ పరిస్థితి ఆగమ్యగోచరంగా తయ్యారైంది. ఒకవైపు ఈ ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపుతూ.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా విరాట్ ఉన్నాడని ఆనందపడలా? లేక ఆర్సీబీ వరుస పరాజయాలకు బాధపడలా? ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితిలో కోహ్లీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ఇలాంటి టైమ్ లో విరాట్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఒకటి అందింది. ఆ వివరాల్లోకి వెళితే..
ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడిన 7 మ్యాచ్ ల్లో ఒక్కే విజయంతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉసూరుమంటోంది. అయితే ఆర్సీబీ స్టార్ బ్యాటర్, టీమిండియా రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ మాత్రం ఈ సీజన్ లో పరుగులు వరద పారిస్తున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్ ల్లో 72.20 సగటుతో 361 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, రెండు ఫిఫ్టీలు ఉన్నాయి. దీంతో ఆర్సీబీ వరుసగా ఓడిపోతున్నాగానీ కోహ్లీ రాణిస్తున్నాడుగా అని సంతోషపడుతూ వస్తున్నారు విరాట్ ఫ్యాన్స్. కాగా.. టీమ్ వరుస పరాజయాలతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న కోహ్లీ ఫ్యాన్స్ కు అదిరిపోయే న్యూస్ ఒకటి అందింది. అదేంటంటే?
విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం దక్కింది. జైపూర్ లోని వ్యాక్స్ మ్యూజియంలో గురువారం(ఏప్రిల్ 18) విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. 35 కిలోలు ఉన్న ఈ మైనపు బొమ్మను ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినట్లు మ్యూజియం వ్యవస్థాపక డైరెక్టర్ అనూప్ శ్రీవాత్సవ్ తెలిపారు. ఇక ఈ విగ్రహాన్ని తయ్యారు చేసేందుకు రెండు నెలలు పట్టిందని చెప్పుకొచ్చారు. కాగా.. ఈ విగ్రహాన్ని నేటి(ఏప్రిల్ 18) నుంచి సందర్శించవచ్చని అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో అభిమానులు విరాట్ మైనపు విగ్రహాన్ని చూడటానికి ఎగబడుతున్నారు. వరుస పరాజయాలతో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ కు ఇది ఊరటనిచ్చే వార్త. ఇక ఈ వ్యాక్స్ మ్యూజియంలో 44 విగ్రహాలు ఉన్నాయి. అందులో ఇప్పటికే క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండుల్కర్, ఎంఎస్ ధోని మైనపు విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఇక రన్ మెషిన్ మైనపు విగ్రహం చూస్తూ.. ఫుల్ హ్యాపీ అవుతున్నారు ఫ్యాన్స్.