Sanju Samson: ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చిన సంజూ శాంసన్! వన్డే స్టైల్లో సెంచరీ..

Sanju Samson Century, Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ 2024లో భాగంగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్ లో అద్బుతమైన సెంచరీతో అలరించాడు టీమిండియా స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్. వన్డే స్టైల్లో శతకం బాదాడు.

Sanju Samson Century, Duleep Trophy 2024: దులీప్ ట్రోఫీ 2024లో భాగంగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్ లో అద్బుతమైన సెంచరీతో అలరించాడు టీమిండియా స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్. వన్డే స్టైల్లో శతకం బాదాడు.

టీమిండియా స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. గత కొంత కాలంగా దారుణంగా విఫలం అవుతూ.. జట్టులో స్థానం కోల్పోయిన విషయం తెలిసిందే. టీమ్ లో ప్లేస్ సంపాదించడం కోసం చాలా రోజులుగా కష్టపడుతున్నాడు. కానీ.. తన పూర్ ఫామ్ తో జట్టులో చోటును మాత్రం సంపాదించుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో దూలీప్ ట్రోఫీలో ఎట్టకేలకు ఓ సెంచరీ బాది టచ్ లోకి వచ్చాడు. ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్ లో వన్డే స్టైల్లో సెంచరీ బాది ఔరా అనిపించాడు. దాంతో తన టీమ్ అయిన ఇండియా-డి పటిష్ట స్థితిలో నిలిచింది.

దులీప్ ట్రోఫీ 2024లో భాగంగా ఇండియా-బితో జరుగుతున్న మ్యాచ్ లో అద్బుతమైన సెంచరీతో అలరించాడు టీమిండియా స్టార్ ప్లేయర్ సంజూ శాంసన్. ఇక ఈ మ్యాచ్ లో వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ.. 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 94 బంతుల్లో శతకం బాదాడు. గత కొంత కాలంగా ఫామ్ లో లేక ఇబ్బంది పడుతున్న ఇతడు.. ఈ మ్యాచ్ తో టచ్ లోకి వచ్చాడు. స్వల్ప వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ వచ్చిన సంజూ.. నిలకడగా రన్స్ చేస్తూ.. అకట్టుకున్నాడు. ప్రత్యర్థి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే వన్డే స్టైల్లో 94 బంతుల్లో సెంచరీ బాదేశాడు. దాంతో జట్టు పటిష్టమైన స్థితిలో నిలిచింది. కాగా.. శాంసన్ కు ఇది 11వ ఫస్ట్ క్లాస్ సెంచరీ.

ఇక సెంచరీతో మంచి ఊపు మీదున్నాడు అనుకునే క్రమంలోనే నవదీప్ సైనీ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి.. నితీశ్ కుమార్ చేతికి చిక్కాడు. దాంతో 106 పరుగులు చేసిన శాంసన్ వెనుదిరగక తప్పలేదు. సంజూ సెంచరీకి తోడు రికీ భుయ్(56), శ్రీకర్ భరత్(52),  దేవదత్ పడిక్కల్(50) అర్థ సెంచరీలతో రాణించడంతో.. ఇండియా-డి 84 ఓవర్లలో 8 వికెట్లకు 331 పరుగుల వద్ద నిలిచింది. మరి లాంగ్ గ్యాప్ తర్వాత శతకంతో మెరిసిన సంజూ శాంసన్.. ఇక ముందు కూడా ఇదే ఫామ్ ను కొనసాగిస్తే.. జట్టులో చోటు ఖాయమనే చెప్పాలి. అయితే.. తొలుత దులీప్ ట్రోఫీలో కూడా శాంసన్ కు అవకాశం దక్కలేదు. ఇషాన్ కిషన్ గాయపడటంతో.. సంజూకు ఛాన్స్ దక్కింది. కానీ రీఎంట్రీ తొలి మ్యాచ్ లో నిరాశపరిచాడు. ఆ మ్యాచ్ లో 5, 40 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. మరి ఇన్నాళ్లకు శతకంతో మెరిసిన సంజూ శాంసన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments