కెప్టెన్సీపై రుతురాజ్ ఫస్ట్ రియాక్షన్.. మాహీ అప్పుడే చెప్పాడంటూ..!

ఐపీఎల్​-2024 సీజన్ ఆరంభం అవడానికి ఒక్క రోజు ముందు సీఎస్​కే తమ కెప్టెన్​ను మార్చేయడం తెలిసిందే. ధోని నుంచి రుతురాజ్ కెప్టెన్సీ బాధ్యతల్ని స్వీకరించాడు. దీనిపై అతడు ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యాడు.

ఐపీఎల్​-2024 సీజన్ ఆరంభం అవడానికి ఒక్క రోజు ముందు సీఎస్​కే తమ కెప్టెన్​ను మార్చేయడం తెలిసిందే. ధోని నుంచి రుతురాజ్ కెప్టెన్సీ బాధ్యతల్ని స్వీకరించాడు. దీనిపై అతడు ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యాడు.

ఐపీఎల్ నయా సీజన్ స్టార్ట్ అవడానికి ఒక్క రోజు ముందు చెన్నై సూపర్ కింగ్స్ తమ కెప్టెన్​ను మార్చేయడం తెలిసిందే. సంచలన నిర్ణయం తీసుకున్న లెజెండ్ ఎంఎస్ ధోని సారథ్యానికి గుడ్​బై చెప్పాడు. నాయకత్వ పగ్గాలను యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్​కు అప్పగించాడు. టోర్నీకి ముందు నిర్వాహకులు ఏర్పాటు చేసిన కెప్టెన్స్ ఫొటోషూట్​తో ఈ విషయం మొదట బయటకు వచ్చింది. ఆ షూట్​లో సీఎస్​కే తరఫున రుతురాజ్ పాల్గొన్నాడు. అన్ని టీమ్స్​కు కెప్టెన్స్ రాగా.. చెన్నై తరఫున ధోని రాకపోవడం, అతడి ప్లేసులో రుతు అటెండ్ అవడంతో అక్కడే అనుమానం మొదలైంది. ధోని కెప్టెన్సీ వదులుకున్నాడని వార్తలు రాసాగాయి. ఆ తర్వాత కాసేపటికే సీఎస్​కే తమ కొత్త కెప్టెన్​గా రుతురాజ్​ను అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ విషయంపై గైక్వాడ్ రియాక్ట్ అయ్యాడు.

కెప్టెన్సీపై రుతురాజ్ ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యాడు. తాను ఓవర్​నైట్ సారథిని అయిపోలేదన్నాడు. దీని గురించి ధోని అప్పుడే చెప్పాడని రివీల్ చేశాడు. ‘గతేడాది మాహీ భాయ్ కెప్టెన్సీ గురించి నాకు హింట్ ఇచ్చాడు. సారథ్య బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఇన్​డైరెక్ట్​గా సూచించాడు. ఇది నాకు సర్​ప్రైజింగ్ న్యూస్ ఏమీ కాదు. ఈసారి నేను సీఎస్​కే క్యాంప్​కు వచ్చినప్పుడు కొన్ని మ్యాచ్ సిచ్యువేషన్స్​ను క్రియేట్ చేసి అందులో నన్ను ఇన్​వాల్వ్ చేశాడు. నన్ను చాలా ముందు నుంచే ప్రిపేర్ చేస్తూ వచ్చారు. సరిగ్గా ఒక వారం ముందు కెప్టెన్సీ గురించి నిర్ణయం తీసుకున్నానని మాహీ నాకు క్లియర్​గా చెప్పాడు. చెన్నై జట్టు సారథిగా ఎంపికవడం చాలా గర్వంగా ఉంది. నా మీద చాలా పెద్ద రెస్పాన్సిబిలీటీ ఉందని తెలుసు. ఈ సీజన్​ కోసం నేను రెడీగా ఉన్నా’ అని రుతురాజ్ చెప్పుకొచ్చాడు.

సీఎస్​కే జట్టు అద్భుతంగా ఉందని.. ఇలాంటి స్క్వాడ్​ను కెప్టెన్​గా లీడ్ చేయనుండటం గర్వంగా ఉందన్నాడు రుతురాజ్. జట్టులో చాలా మంది అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారు.. కాబట్టి సారథిగా తన పని చాలా ఈజీ అన్నాడు. టీమ్​ను ముందుండి నడపడం ఎగ్జయిటింగ్​గా అనిపిస్తోందని తెలిపాడు. ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా తనకు గైడ్ చేసేందుకు మాహీ భాయ్ టీమ్​లో ఉన్నాడని రుతురాజ్ పేర్కొన్నాడు. ధోనీతో పాటు ఎంతో ఎక్స్​పీరియెన్స్ ఉన్న రవీంద్ర జడేజా, అజింక్యా రహానె లాంటి వాళ్లు ఉండటం మంచి విషయమని వ్యాఖ్యానించాడు. అందుకే తాను ఎక్కువగా ఆందోళన చెందడం లేదని, ఈ సీజన్​లో గేమ్​ను ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నానని రుతురాజ్ వివరించాడు. మరి.. కెప్టెన్సీ ఓవర్​నైట్ రాలేదని, ధోని ముందే హింట్ ఇచ్చాడంటూ రుతురాజ్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments