BCCI set Retirement of MS Dhoni iconic jersey number 7: BCCI కీలక నిర్ణయం.. MS ధోని ఐకానిక్ జెర్సీ నంబర్‌ 7కు రిటైర్‌మెంట్

BCCI కీలక నిర్ణయం.. MS ధోని ఐకానిక్ జెర్సీ నంబర్‌ 7కు రిటైర్‌మెంట్

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. భారత లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోని ఐకానిక్ జెర్సీ నెంబర్ 7కు రిటైర్ మెంట్ ప్రకటించింది. దీంతో ఏ భారత ఆటగాడు కూడా జెర్సీ నెంబర్ 7ను ఉపయోగించలేరు.

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. భారత లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోని ఐకానిక్ జెర్సీ నెంబర్ 7కు రిటైర్ మెంట్ ప్రకటించింది. దీంతో ఏ భారత ఆటగాడు కూడా జెర్సీ నెంబర్ 7ను ఉపయోగించలేరు.

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని జర్సీ విషయంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ధోని ఐకానిక్ జెర్సీ నెంబర్ 7కు రిటైర్ మెంట్ ఇవ్వనుంది. పలు మీడియా నివేదికల ప్రకారం.. మహేంద్ర సింగ్ ధోని జెర్సీ నెంబర్ 7ను బీసీసీఐ రిటైర్ చేసింది. గతంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ జెర్సీ నెంబర్ 10కు కూడా 2017లో బీసీసీఐ రిటైర్ మెంట్ ఇచ్చింది. బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు ధోని కూడా ఈ వరుసలో చేరారు. సచిన్ జెర్సీ తర్వాత రిటైర్ మెంట్ పొందిన జెర్సీ ధోనిదే కావడం విశేషం. కాగా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ ఇద్దరి లెజండరీ క్రికెటర్ల జెర్సీలను మరే ఆటగాడు వినియోగించలేడు.

మీడియా కథనాల ప్రకారం.. భారత క్రికెట్ నియంత్రణ మండలి సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఆటగాళ్లందరికీ ఇప్పుడు నంబర్-10తో పాటు నంబర్-7 జెర్సీని ధరించే అవకాశం లేదని ఇప్పటికే తెలియజేసినట్లు తెలిపారు. మహేంద్ర సింగ్ ధోనీ యొక్క చారిత్రాత్మక జెర్సీ నంబర్ 7ని ఉపయోగించవద్దని బీసీసీఐ భారత క్రికెట్ జట్టులోని ప్రస్తుత ఆటగాళ్లకు మరియు కొత్తగా రాబోయే యువ ఆటగాళ్లందరికీ తెలియజేసింది. భారత క్రికెట్‌కు ధోనీ చేసిన సేవల కారణంగా అతని జెర్సీ నంబర్‌ను రిటైర్ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.

2019 వన్డే ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో మహేంద్ర సింగ్ ధోనీ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ని న్యూజిలాండ్‌తో ఆడారు. ఆ తర్వాత ఆగస్టు 15, 2020న, మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. భారత్‌కు అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ధోని నిలిచారు. అదేవిధంగా మూడు ప్రధాన ఐసీసీ టోర్నమెంట్‌లు, టీ20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్ గెలుచుకున్న ప్రపంచంలోని ఏకైక కెప్టెన్ ఎంఎస్ ధోని. దీంతో పాటు ధోనీ సారథ్యంలో టీమిండియా టెస్టు ఫార్మాట్‌లో నంబర్‌-1గా నిలిచింది. ధోనీ భారత క్రికెట్ కు చేసిన సేవలను గౌరవిస్తూ బీసీసీఐ అతని జెర్సీ నంబర్-7ను రిటైర్ చేసింది.

Show comments