10 మంది స్కోర్లను ఒక్కడే బాదేశాడు.. 23 బంతుల్లోనే విధ్వంసం!

  • Author Soma Sekhar Published - 05:35 PM, Tue - 5 December 23

అబుదాబీ టీ10 లీగ్ 2023లో ఇంట్రెస్టింగ్ గణాంకాలు నమోదు అయ్యాయి. ఓ బ్యాటర్ ప్రత్యర్థి జట్టులోని పది మంది సాధించిన స్కోర్ల కంటే ఎక్కువ రన్స్ చేసి.. అందరిని ఆశ్చర్యపరిచాడు. కేవలం 23 బంతుల్లోనే విధ్వంసం సృష్టించి జట్టుకు విజయాన్ని అందించాడు.

అబుదాబీ టీ10 లీగ్ 2023లో ఇంట్రెస్టింగ్ గణాంకాలు నమోదు అయ్యాయి. ఓ బ్యాటర్ ప్రత్యర్థి జట్టులోని పది మంది సాధించిన స్కోర్ల కంటే ఎక్కువ రన్స్ చేసి.. అందరిని ఆశ్చర్యపరిచాడు. కేవలం 23 బంతుల్లోనే విధ్వంసం సృష్టించి జట్టుకు విజయాన్ని అందించాడు.

  • Author Soma Sekhar Published - 05:35 PM, Tue - 5 December 23

క్రికెట్ మ్యాచ్ ల్లో అప్పుడప్పుడు ఆసక్తికర గణాంకాలు నమోదు అవుతూ ఉంటాయి. జట్టులో 10 మంది కలిసి కొట్టిన రన్స్ కు ఒకే ఒక్క బ్యాటర్ కొట్టడం మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. తాజాగా అలాంటి అరుదైన గణాంకాలు ఓ మ్యాచ్ లో క్రియేట్ అయ్యాయి. అబుదాబీ టీ10 లీగ్ 2023 సీజన్ లో ఈ ఇంట్రెస్టింగ్ రికార్డు నెలకొల్పబడింది. ఈ లీగ్ లో టీమ్ అబుదాబీ-బంగ్లా టైగర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో ఓ బ్యాటర్ ప్రత్యర్థి జట్టులోని పది మంది సాధించిన స్కోర్ల కంటే ఎక్కువ రన్స్ చేసి.. అందరిని ఆశ్చర్యపరిచాడు. కేవలం 23 బంతుల్లోనే విధ్వంసం సృష్టించి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

అబుదాబీ టీ10 లీగ్ 2023లో ఇంట్రెస్టింగ్ గణాంకాలు నమోదు అయ్యాయి. టీమ్ అబుదాబీ-బంగ్లా టైగర్స్ జట్ల మధ్య ఇటీవల మ్యాచ్ జరిగింది. ఈ పోరులో బంగ్లా టైగర్స్ బ్యాటర్, ఇంగ్లాండ్ యువ సచంలనం జోర్డన్ కాక్స్ విధ్వంసం సృష్టించాడు. ఈ గేమ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన అబుదాబీ టీమ్ నిర్ణీత 10 ఓవర్లలో కేవలం 65 రన్స్ కే ఆలౌట్ అయ్యింది. బంగ్లా టైగర్స్ బౌలర్ డానియల్ సామ్స్ 3 వికెట్లతో సత్తా చాటాడు. అబుదాబీ బ్యాటర్లలో ఇద్దరు ప్లేయర్లు డకౌట్ కాగా.. ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం అయ్యారు. అనంతరం 66 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా టైగర్స్ 4.5 ఓవర్లలోనే కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఘన విజయం సాధించింది.

ఇక ఈ మ్యాచ్ లో జోర్డన్ కాక్స్ కేవలం 23 బంతుల్లోనే 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేసి.. ఒంటి చేత్తో జట్టుకు విజయాన్ని అందించి అజేయంగా నిలిచాడు. టీమ్ అబుదాబీ చేసిన స్కోర్(65)లో జోర్డన్ ఒక్కడే 90 శాతానికిపైగా చేశాడు. కాగా.. జట్టులో 10 మంది ఆటగాళ్లు చేసిన స్కోర్ ను జోర్డన్ కాక్స్ ఒక్కడే దంచికొట్టాడు. అబుదాబీ టీమ్ లో ఉన్న కైల్ మేయర్స్(6), అలెక్స్ హేల్స్(2), టామ్ బాంటన్(0) లాంటి స్టార్ బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. మరి పది మంది ఆటగాళ్లు సాధించిన స్కోర్ ను జోర్డన్ కాక్స్ ఒక్కటే కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments