Details About B Form: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీ ఫారం అంటే ఏంటి.. ఎవరికి ఇస్తారో తెలుసా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీ ఫారం అంటే ఏంటి.. ఎవరికి ఇస్తారో తెలుసా?

తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే పనిలో బిజీగా ఉన్నాయి. ఇక అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం అభ్యర్థుల జాబితాను ప్రకటించడమే కాక.. కొందరికి బీ ఫారాలు కూడా అందజేశారు సీఎం కేసీఆర్‌. ఇక ఎన్నికల వేళ.. బీ ఫారం అనే మాట తరచుగా వినిపిస్తుంది. మరి ఇంతకు ఈ బీ ఫారం అంటే ఏంటి.. ఇది ఎందుకు ఇస్తారు.. దీని ప్రాధాన్యత ఏంటో మీకు తెలుసా.. లేదా అయితే తెలుసుకొండి.

ఎన్నికల్లో పోటీ చేసే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలు అన్నీ.. తమ అభ్యర్థులకు బీ ఫారాలు అందజేస్తాయి. అంటే తమ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసేది వీరే అని గుర్తించేందుకు గాను ఈ బీ ఫారాలను అందజేస్తారు. అంతేకాక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి.. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల గుర్తులు రావాలంటే.. ఈ బీ ఫారం అవసరం. అందుకే అభ్యర్థులు నామినేషన్‌ వేసే సమయంలో ఎన్నికల అధికారులకు ఈ బీ ఫారం అందజేస్తారు. అయా పార్టీలకు చెందిన అధ్యక్షులు లేదా ప్రత్యేకంగా నియమించిన ప్రతినిధులు ఈ బీ ఫారాన్ని అందజేస్తారు.

Show comments