Swetha
OTT Suggestion : OTT లో ఎప్పుడెప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతుందా.. ఏ వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా అని సెర్చ్ చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు కొన్ని వెబ్ సిరీస్ లను మిస్ చేస్తారు. ఈ క్రమంలో ఆ లిస్ట్ లో ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి.
OTT Suggestion : OTT లో ఎప్పుడెప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతుందా.. ఏ వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా అని సెర్చ్ చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు కొన్ని వెబ్ సిరీస్ లను మిస్ చేస్తారు. ఈ క్రమంలో ఆ లిస్ట్ లో ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి.
Swetha
OTT లో ఎప్పుడెప్పుడు ఏ సినిమా రిలీజ్ అవుతుందా.. ఏ వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుందా అని సెర్చ్ చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు కొన్ని వెబ్ సిరీస్ లను మిస్ చేస్తారు. ఈ క్రమంలో ఆ లిస్ట్ లో ఇప్పుడు చెప్పుకోబోయే వెబ్ సిరీస్ కూడా ఉందేమో ఓ లుక్ వేసేయండి.
ఈ వెబ్ సిరీస్ కథ గురించి తెలిస్తే మాత్రం అసలు మిస్ చేయకుండా చూస్తారు. లక్కీ భాస్కర సినిమా ఎంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుందో ఈ సిరీస్ అంతకంటే ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ రెండు సీజన్స్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సీజన్స్ లోని ప్రతి ఎపిసోడ్ కూడా ప్రేక్షకులకు ఎంగేజింగ్ గానే ఉంచుతుంది. అసలు ఈ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమ్ అవుతుంది అనుకుంటున్నారా.. దానికంటే ముందు ఈ సిరీస్ స్టోరీలైన్ ఏంటో చూసేద్దాం.
ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. బ్యాంక్ నుంచి చేస్తున్నామని చెప్పి ఓటీపీ అడుగుతూ తరచూ నకిలీ కాల్స్ రావడం గురించి తెలిసే ఉంటుంది. కేవలం OTP చెప్తే అకౌంట్ లో డబ్బంతా ఖాళీ అవుతుంది. ఇప్పుడు ఇదే విషయాన్నీ ఈ సిరీస్ లో చూపిస్తారు. ఈ స్టోరీ లైన్ చదివినంత ఈజీగా అయితే ఉండదు.. ప్రతి ఎపిసోడ్ కూడా తర్వాత ఏమి జరుగుతుందా అనే ఉత్కంఠతో కొనసాగుతుంది. ఇందులో అమిత్ సియార్, దిబ్యేందు భట్టాచార్య, స్పార్ష్ శ్రీవాస్తవ, ఆసిఫ్ ఖాన్ కీలకపాత్రలు పోషించారు. సౌమ్యేంద్ర పాది రూపొందించిన ఈ క్రైమ్ డ్రామా సిరీస్ ఇప్పటికీ ఓటీటీలో దూసుకుపోతుంది. ఈ స్టోరీ కంప్లీట్ గా సస్పెన్స్థ్రిల్లర్ ట్విస్టులతో సాగుతుంది. ఈ సిరీస్ పేరు జమ్తారా. ప్రస్తుతం ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికి ఈ సిరీస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.