తుడ‌ర‌మ్.. OTT స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Thudarum OTT streaming date : మలయాళ ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ లను ఎప్పుడు సవరిస్తూ ఉండే హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మోహన్ లాల్ మాత్రమే . కేవలం నెల రోజుల్లోనే ఆయన నుంచి వచ్చిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ఎల్-2 ఎంపురాన్ డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత రిలీజ్ అయినా తుడురుమ్ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చినా కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తుంది.

OTT లోనే కాదు థియేటర్స్ లో కూడా మలయాళ సినిమాలు ఎప్పుడు ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాయి. అదేంటో తెలీదు కానీ మలయాళ కథలలో ఎదో మ్యాజిక్ ఉంటుంది. అది ఏ జోనర్ అయినా కానీ ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇక ముఖ్యంగా మలయాళ ఇండస్ట్రీ బాక్స్ ఆఫీస్ లను ఎప్పుడు సవరిస్తూ ఉండే హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది మోహన్ లాల్ మాత్రమే . కేవలం నెల రోజుల్లోనే ఆయన నుంచి వచ్చిన రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ఎల్-2 ఎంపురాన్ డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత రిలీజ్ అయినా తుడురుమ్ ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చినా కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తుంది. ఇప్పటిదాకా ఈ సినిమా రూ.230 కోట్ల వ‌సూళ్ల‌తో టాప్-3 మ‌ల‌యాళ గ్రాస‌ర్‌గా నిలిచింది.

అయితే ఈ సినిమా ఎప్పుడో OTT లోకి రావాల్సి ఉంది. కానీ టాక్ బావుండడంతో ఇంకొన్ని రోజులు థియేటర్ లోనే ఉంచేశారు మేకర్స్. ఇక ఇప్పుడు ఈ మూవీ OTT డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను మే 30 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. మళయాళంతో పాటు ఎలాగూ తెలుగులో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. అంతే కాకుండా తెలుగు వాళ్ళు మలయాళ సినిమాలను ఇష్టపడుతూనే ఉంటారు. కాబట్టి ఈ సినిమా ఎప్పుడెప్పుడు OTT లోకి వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక OTT లో ఈ మూవీ ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments