Best Horror Movie OTT Suggestion: ఈ హారర్ మూవీ అస్సలు మిస్ కావొద్దు.. OTTలో బాబోయ్ అనిపించకమానదు

ఈ హారర్ మూవీ అస్సలు మిస్ కావొద్దు.. OTTలో బాబోయ్ అనిపించకమానదు

ఇటీవల హారర్ మూవీస్ చిత్రాలకు బాగా ఆదరణ పెరిగింది. వీకెండ్ లో అలాంటి మూవీస్ ఏమన్నా ఓటీటీలో ఉన్నాయా అని చూస్తున్నారు. లేకుంటే పాతవి ఏవైనా మిస్ అయ్యామా అని సెర్చ్ చేస్తున్నారు. అలాంటి వారి కోసమే ఈ సినిమా.

ఇటీవల హారర్ మూవీస్ చిత్రాలకు బాగా ఆదరణ పెరిగింది. వీకెండ్ లో అలాంటి మూవీస్ ఏమన్నా ఓటీటీలో ఉన్నాయా అని చూస్తున్నారు. లేకుంటే పాతవి ఏవైనా మిస్ అయ్యామా అని సెర్చ్ చేస్తున్నారు. అలాంటి వారి కోసమే ఈ సినిమా.

దెయ్యాలు, భూతాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే.. ఈ జోనర్ సినిమాలు కానీ వెబ్ సిరీస్‌లు వస్తున్నాయంటే.. భయపడుతూనే చూస్తూనే ఉంటాం. హారర్ మూవీస్ చూసేటప్పుడు.. కళ్లు, చెవులు మరింత పెద్దవి చేసుకుని వాచ్ చేస్తుంటాం. ఈ జోనర్ చిత్రాలకు థియేటర్లలోనే కాదు.. ఇటీవల ఓటీటీలో కూడా విపరీతమైన ఆదరణ పెరిగింది. అందుకే ప్రతి వీక్ ఏదైనా హారర్ మూవీ కానీ, సిరీస్ కానీ ఉందా అని సెర్చ్ చేస్తుంటారు. ఈ వారంలో అంత చెమటలు పట్టించే ఘోస్ట్ చిత్రాలు ఏమీ లేవు కానీ.. ఒకప్పుడు విపరీతంగా వ్యూస్ రాబట్టుకుంది ఓ షార్ట్ మూవీ. ఇందులో తెలుగు స్టార్ హీరోయిన్లు నటించడం గమనార్హం. ఒక వేళ ఈ మూవీ చూడకుంటే.. ఈ వారంలో ఏదైనా బెస్ట్ హారర్ చిత్రం చూడాలనుకుంటే.. ఇది మంచి ఆప్షన్.

ఇటీవల డిఫరెంట్ జోనర్‌లో అంథాలజీ మూవీస్ వచ్చాయి. అలాంటి ఓ మూవీనే ఘోస్ట్ స్టోరీస్. ఇది నాలుగు కథల సమ్మేళనం. కరణ్ జోహార్, దిబాకర్ బెనర్జీ, జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్ ఈ నాలుగు కథలకు దర్శకత్వం అందించారు. 2020లో డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చేసింది ఈ షార్ట్ ఫిల్మ్. ఇందులో శోభితా దూళిపాళ, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, అవినాష్ తివారీ, రఘువీర్ యాదవ్, విజయ్ వర్మ, పావైల్ గులాటి, గుల్షన్ దేవయ్య తదితరులు నటించారు. ఆర్ఎస్‌వీపీ మూవీస్, ఫ్లయింగ్ యూనికార్న్ ఎంటర్‌టైన్‌మెంట్‌పై రోనీ స్క్రూవాలా, ఆషి దువా నిర్మించారు. 2020 జనవరి 1న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్‌లో సందడి చేస్తుంది. ఇక మూవీ ప్లాట్ విషయానికి వస్తే.. నాలుగు కథల్లో నాలుగు హారర్ స్టోరీస్ ఉంటాయి.

తొలి కథలో జాన్వీ సమీర పాత్రలో నటించింది. సమీర ఓ నర్సు. జయ అనే పేషెంట్‌ను చూసుకునేందుకు ఆమె ఇంటికి వెళుతుంది. ఆమెకు ఓ కొడుకు ఉంటాడు. ఆర్మాన్ ఆమెను చూసుకోడు. కానీ సమీర అక్కడకు వచ్చాక వింతగా ప్రవర్తిస్తుంటుంది జయ. అక్కడ ఆమె ఎదుర్కొన్న అనుభవాలేంటీ అనే మిగిలిన కథ. మనోజ్, నేహా (శోభితా) భార్యా భర్తలు.. వీరికి పుట్టన బిడ్డ చనిపోగా.. ఫ్రెండ్ కొడుకుని తన కొడుకులా ట్రీట్ చేస్తూ ఉంటుంది. అయితే మరోసారి ప్రెగ్నెంట్ అవుతుంది నేహా.. అప్పుడు ఆమెకు ఎదురయ్యే అనుభవాలు చాలా భయనకంగా ఉంటాయి. ఈ ఎపిసోడ్ ఒళ్లు గగొర్పొడుస్తుంది. మరో స్టోరీలో సుధీర్ అనే వ్యక్తి ఓ ఊరికి సర్వేకి అవుతాడు. అది గ్రామానికి చాలా దూరంగా ఉంటుంది. ఆ ఊరంతా వింత జంతువులుగా మారిపోతుంటారు. అక్కడ నుండి ఎలా తప్పించుకున్నాడు అనేది కథ. ఇక మృణాల్ ఠాగూర్ కథ కూడా చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. నెట్ ఫ్లిక్స్ లో ఉంది చూసి ఎంజాయ్ చేయండి.

Show comments