భగవంత్ కేసరి నిజంగానే అంత బాగుందా?

మొన్నీ మధ్య వరంగల్లో యువరత్న బాలక్రిష్ణ సమక్షంలో భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ వేడుకలు జరిగిన దగ్గరనుంచి ఆ చిత్రం మీద అంచనాలు మిన్ను ముడుతున్నాయి. ఓకే….ఇటువంటి కార్యక్రమాలలో ఓ వైపున అభిమానుల సందడి విపరీతంగా ఉంటుంది. మరో వైపు కార్యక్రమానికి వచ్చిన అతిథులు, నటీనటులు సినిమా గురించి హైలో మాట్లాడతారు. ఇటువంటి ఫంక్షన్స్ లో ఈ హడావుడి సర్వసాధారణంగా జరిగే తంతే. పెద్ద వింతేమీ ఉండదు. కానీ భగవంత్ కేసరి విషయంలో అందరూ ఫీలవుతున్న ప్రత్యేకత ఒకటే. అనిల్ రావిపూడి, నందమూరి బాలక్రిఫ్ణ కాంబినేషన్లో వస్తున్న మొదిటి సినిమా ఇది. అనిల్ మార్కు మేకింగ్ బాలయ్యకి సరిపోతుందా? లేదా బాలయ్య ట్రెండ్ ఫాలో అయి అనిల్ సినిమా తీశాడా అన్నదే ఇక్కడ డిబేట్.

ట్రైలర్ చూస్తే బాలయ్య ధోరణే ఎక్కువగా కనిపిస్తోంది. యాక్షన్ ప్లస్ ఎమోషన్.. ప్లస్ బాలయ్య మార్క్ డైలాగులు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. అవే బాలయ్య అభిమానులను బాగా ఊరిస్తున్నాయి. సాధారణ ప్రేక్షకులకు కూడా ఈ మేళవింపు బాగానే వంటబట్టినట్టుంది. కేవలం ట్రైలర్ ఒక్కటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ని క్రాస్ చేసిందంటే సినిమా మీద అంచానలు ఎంత భారీగా ఉన్నాయన్నది తెలుస్తోంది. అనిల్ రావిపూడి మేకింగ్ స్టయిల్ తను తీసిన సినిమాలన్నీ నిరూపించాయి. బాక్సాఫీసు సాక్షిగా గట్టి మోతాదులోనే నిలబడ్డాయి.

సో…ఆ విషయంలో అనిల్ స్టాండర్డ్స్ ప్రూ అయ్యాయి అని పరిశ్రమంతా ఒప్పుకుంటోంది. అనిల్ కూడా ఏ మాత్రం సందేహించకుండా బాలయ్య ధోరణిని బట్టి అవే కొలతలలో చివరి ఫ్రేం వరకూ వెళ్ళాడని ఒప్పుకోక తప్పదు. అది అవసరం కూడా. భారీ కమర్షియల్‌ చిత్రాలకొచ్చేసరికి ఈ కొలతలు, తూనికల విభాగం కరెక్ట్‌గా పనిచేయవలసిందే. అనిల్ రావిపూడి ఈ బాధ్యతను తనదైన ఒడుపుతో పరిపూర్ణంగా నెరవేర్చినట్టుగానే కనబడుతోంది. అందుకే కొత్తగా ట్రై చేశానని చెబుతున్నాడు.

ఇందులో మరో ప్రత్యేకత ఏంటంటే ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న శ్రీ లీల మెయిన్ క్యారెక్టర్ చెయ్యడం, కాజల్ అగర్వాల్ కూడా మరో ప్రధానమైన పాత్రలో నటించడం ఇవన్నీ సినిమాకి ఓ స్పెషల్ టచ్ ని క్రియేట్ చేశాయని చెప్పాలి. బాలయ్య ఒకే టైపులో కనిపించినట్టుగా ఉంటుంది కానీ, హెవీనెస్ ప్లస్ హై ఎమోషన్ ని హేండిల్ చెయ్యడంలో బాలయ్య బాగా సక్సెస్ అవుతున్నారన్నది లెజెండ్, సింహా నుంచి నిన్నటి వీరసింహారెడ్డి వరకూ ఆ సినిమాల రిజల్ట్స్ చెప్పకచెబుతున్నాయి.

వీటన్నిటి నేపథ్యంలో భగవంత్ కేసరి సినిమాకి మామ్మూలు హైప్ రాలేదు. ఈ ఒక్క రోజు మాత్రమే ఉంది. రేపు సినిమా ధియేటర్లలోకి రాబోతోంది. బాలయ్య అభిమానులు పుంజాలు తెంపుకుని ధియేటర్లకు పరిగెట్టడానికి కరెక్టుగా 24 గంటలు మాత్రమే వ్యవధి ఉంది. సినిమా గురించి కొందరు చాలా హైగా మాట్లాడుతున్నారు. మరోవైపు మాట్లడడానికే సంకోచిస్తున్నారు. రిజల్టుని తలుచుకుని అందరూ వణుకుతున్నారు. అందరూ అనుకున్నట్టుగా సినిమా సూపర్ హిట్ అయితే ఇండస్ట్రీ కళకళలాడుతుంది. లేదంటే టైగర్ నాగేశ్వరరావుకి ఎడ్వాంటేజ్. ఏదైనా బాలయ్య మార్కు సినిమాగా, అనిల్ రావిపూడి పంథాలో వస్తున్న సినిమా కాబట్టి అందరికీ ఒక ఆశ సినిమా మీద. కొన్ని గంటలు ఓపిక పడదాం. ఏమవుతుందో చూద్దాం.

                                                                                       – నాగేంద్ర కుమార్‌

Show comments