టీఎస్ ఆర్టీసీ సమ్మె- కరీంనగర్లో ఉద్రిక్తత

కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బీజేపీ చేపట్టిన ర్యాలీలో పెద్ద ఎత్తున ఘర్షణ తలెత్తింది. ఈ ఘర్షణలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు కారుకు అడ్డంగా పడుకున్నారు. కిలోమీటర్ మేర పరుగులు తీసి మరీ పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.

తమ ఎంపీని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ప్రశ్నించారు. కార్మికులకు మద్దతు ఇస్తే అరెస్ట్ చేస్తారా అంటూ నిలదీశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కార్యకర్తల తోపులాటలో ఏసీపీ అశోక్ కుమార్ కిందపడిపోయారు. గమనించిన కానిస్టేబుల్స్ వెంటనే ఆయనను పైకి లేపారు. ఎంపీ బండి సజయ్ కలుగజేసుకుని కార్యకర్తలకు సర్దిచెప్పడంతో కాసేపటి తర్వాత పరిస్థితి సద్దుమణిగింది.

Show comments