పోలీస్ పవన్ జోడిగా సాయిపల్లవి

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకుని శరవేగంగా పరుగులు పెడుతున్న అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ లో పవన్ కళ్యాణ్ సరసన జోడిగా సాయి పల్లవి ఫిక్సయినట్టుగా లేటెస్ట్ అప్ డేట్. ఇది గతంలో వచ్చిన వార్తే అయినప్పటికీ త్వరలోనే తను సెట్స్ లోకి అడుగు పెట్టడం ఖాయమని ఈ మేరకు డేట్లు కూడా తీసుకున్నారని సమాచారం. అఫీషియల్ గా ఒక పోస్టర్ లేదా చిన్న వీడియో ద్వారా దీన్ని రివీల్ చేసే అవకాశం ఉంది. మరో హీరోయిన్ రానా భార్యగా ఐశ్యర్య రాజేష్ ఉండొచ్చని ఇప్పటికే లీక్ ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మాటలు సమకూరుస్తున్న ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఇప్పుడీ మూవీకి మూడు టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. ఒకటి బిల్లా రంగా. ఇద్దరు హీరోల క్యారెక్టర్లను ప్రతిబింబించేవిధంగా సెట్ చేసినట్టుగా దీనికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటు పోలీస్ పటేల్, రుద్ర అనే మరో రెండు పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. దాదాపుగా మొదటిదే ఖరారు కావొచ్చు. ఇందులో పవన్ పోలీస్ ఇన్స్ పెక్టర్ గా కనిపిస్తాడు. ఒరిజినల్ వెర్షన్ కథ ప్రకారం తనకు జోడిగా నటించే సాయి పల్లవి అటవీ ప్రాంతంలో వెనుకబడిన తెగల హక్కుల కోసం పోరాడే కార్యకర్తగా కనిపిస్తుంది. ఏమైనా మార్పులు చేశారేమో విడుదలయ్యేకే క్లారిటీ వస్తుంది.

ఏప్రిల్ 9న వకీల్ సాబ్ వచ్చాక నెక్స్ట్ విడుదలయ్యే సినిమా ఇదే. దీని తర్వాతే క్రిష్ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది. ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో అయ్యప్పనుం కోశియుమ్ రీమేక్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని గట్టిగా డిసైడ్ అయ్యారు. ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాల కోసం హైదరాబాద్ లోనే భారీ పోలీస్ సెట్ ఒకటి నిర్మించారు. ప్రస్తుతం అందులోనే షూట్ జరుగుతోంది. ఇదయ్యాక అరకు, కేరళ తదితర ప్రాంతాల్లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణతో పూర్తవుతుంది. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా తరహాలో ఇందులో ఎక్కువ పాటలు ఉండకపోవచ్చు. పవన్ కోసం అదనంగా జోడిస్తారేమో చూడాలి

Show comments