IPL 2022 : సచిన్ రికార్డుని సమం చేసిన రుతురాజ్

ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్‌కి మధ్య జరిగిన IPL మ్యాచ్‌లో చెన్నై భారీ విజయం సాధించింది. చెన్నై ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌ (57 బంతుల్లో 99), డెవాన్‌ కాన్వే (55 బంతుల్లో 85నాటౌట్‌) తమ బ్యాట్‌తో చెలరేగిపోయారు. దీంతో చెన్నై 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 202 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఇక హైదరాబాద్ 20 ఓవర్లలో 189 పరుగులు చేసి మ్యాచ్‌ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో రుతురాజ్ శతకం మిస్ చేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో రెండు రికార్డులు నమోదయ్యాయి. డెవాన్‌ కాన్వేతో కలిసి రుతురాజ్‌ తొలి వికెట్‌కు 182 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. ఐపీఎల్‌లో చెన్నైకి ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 2020 సీజన్‌లో వాట్సన్‌, డుప్లెసిస్‌ తొలి వికెట్‌కు 181 పరుగులు జోడించగా, తాజాగా రుతురాజ్‌, కాన్వేతో కలిసి ఆ రికార్డుని ఛేదించాడు.

అంతేకాక ఇదే మ్యాచ్‌లో రుతురాజ్‌ మరో రికార్డును సాధించాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తిచేసుకున్న రెండో భారత బ్యాటర్‌గా సచిన్ సరసన నిలిచాడు. సచిన్ 31 ఇన్నింగ్స్‌ల్లో 1000 పరుగులు పూర్తి చేయగా, రుతురాజ్ కూడా సరిగ్గా 31 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు. ఈ ఘనత సాధించడంతో చెన్నై టీం రుతురాజ్‌కి స్పెషల్‌గా అభినందనలు తెలియచేస్తూ ట్వీట్ చేసింది.

Show comments