రైతు భరోసా పధకం ప్రారంభించిన సీఎం జగన్

ఆంధ్ర ప్రదేశ్ లో అన్నదాతలకు ఏడాదికి రూ.13,500 చొప్పున పంట పెట్టుబడికి ఆర్థిక సహాయం ఇచ్చే ‘వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌’ పథాకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కాకుటూరు గ్రామంలోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతు భరోసా పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. రైతు భరోసా పథకం ప్రారంభ కార్యక్రమంలో అబ్దుల్‌ కలాం చిత్రపటానికి సీఎం వైఎస్‌ జగన్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. అంతకుముందు దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

Show comments