ఆటో జానీ మీద మళ్ళీ ఆశలు

మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు పూరి జగన్నాధ్ ఓ సినిమా చేయాలన్నది ఇద్దరి అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తో బద్రి, కెమెరా మెన్ గంగతో రాంబాబు చేసినా అన్నయ్యతో తీయడమనే కల మాత్రం పూరికి అలాగే ఉండిపోయింది. మంచి ఫామ్ ఉన్న టైంలో ఓ కథ వినిపిస్తే అది ఓకే కాలేదు. దాన్నే కొద్దిపాటి మార్పులతో జూనియర్ ఎన్టీఆర్ తో ఆంధ్రావాలాగా తీశాడని అప్పటి మీడియాలో కథనాలు వచ్చాయి. అది నిజమైతే చిరు జడ్జ్ మెంట్ కరెక్టేనని అర్థమవుతుంది. రాజకీయాలు మానేసి కంబ్యాక్ అవుతున్న టైంలో ఖైదీ నెంబర్ 150 మొదలవ్వడానికి ముందే ఎంతో ఇష్టపడి రాసుకున్న ఆటో జానీ సబ్జెక్టు చిరుకి వినిపించాడు పూరి.

vv vinayak tagore movie


కానీ సెకండ్ హాఫ్ విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడంతో పట్టాలు ఎక్కలేదు. ఈలోగా వివి వినాయక్ కత్తి రీమేక్ తో హిట్టు కొట్టేశారు ఆ తర్వాత ఇటు పూరి కూడా పూర్తిగా అవుట్ అఫ్ ది ఫామ్ అయిపోయాడు. ఇటీవలే లైగర్ డిజాస్టర్ మరీ దారుణంగా దెబ్బ కొట్టింది. సినిమా ఫ్లాప్ కావడం ఎవరికీ కొత్త కాదు కానీ దానికి సంబంధించిన పెట్టుబడుల గురించి ఏకంగా ఫెమా యాక్ట్ కింద ఈడీ అధికారులకు వివరణ ఇవ్వాల్సి రావడం పూరి ఇమేజ్ ని కొంత డ్యామేజ్ చేసింది. ఇప్పుడు స్టార్ హీరోలెవరూ తనతో చేసేందుకు సిద్ధం లేరు. కొడుకు ఆకాష్ తోనే ఓ ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నారన్న టాక్ ఉంది కానీ తన రేంజ్ కి బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే పెద్ద హీరో అండదండ చాలా అవసరం

అందుకే గాడ్ ఫాదర్ లో నటిస్తున్న టైంలో పూరి చిరంజీవికి ఒక లైన్ వినిపించాడట. అది నచ్చిన మెగాస్టార్ ఫుల్ వెర్షన్ మీద పని చేయమని చెప్పడంతో ఇప్పుడు తిరిగి ఆ వర్క్ స్టార్ట్ చేసే పనిలో ఉన్నట్టు వినికిడి. సబ్జెక్టు నచ్చితే దర్శకుడి ట్రాక్ రికార్డు చిరంజీవి పట్టించుకోవడం లేదని ఆయన సెలక్షన్ చూసే చెప్పొచ్చు. వేదాళం రీమేక్ కి మెహర్ రమేష్ ని ఎంచుకున్నప్పుడు అభిమానులు వద్దని ఎంత మొత్తుకున్నా అదేమీ పట్టించుకోకుండా తన నిర్ణయానికే కట్టుబడ్డారు. ఇప్పుడు పూరి ఎంత బ్యాడ్ ఫామ్ లో ఉన్నా సరే నెరేషన్ నచ్చితే మాత్రం పట్టాలు ఎక్కించేస్తారు. కాకపోతే పూరి కనెక్ట్స్ తో సంబంధం లేకుండా బయట ప్రొడక్షన్ హౌస్ కి చేయొచ్చు
Show comments