జేసీ దివాకర్‌ రెడ్డి లేటెస్ట్‌.. ఇక అక్కడ నుంచి రాజకీయం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ మంత్రి, మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డిది ప్రత్యేక శైలి. ఆయన ఏది మాట్లాడినా ఏది చేసినా సరే మీడియాలో హైలెట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మరోసారి జేసి దివాకర్ రెడ్డి హైలెట్ అయ్యారు. కాంగ్రెస్ శాసన సభాపక్ష కార్యాలయానికి వచ్చారు ఆయన. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

తెలంగాణా ఉప ఎన్నికల గురించి మాట్లాడుతూ… హుజూరాబాద్ గురించి నాకు తెలియదు అని అన్నారు. నాగార్జున సాగర్ లో జానారెడ్డి ఎందుకు ఓడిపోయాడు అనేది అందరికీ తెలుసు అంటూ కామెంట్స్ చేసారు.

రాజకీయాలు బాగోలేదు అని, సమాజం కూడా బాగోలేదు అన్నారు ఆయన. జానారెడ్డి గెలవడం కష్టం అని చెప్పిన గెలిచాడా అంటూ తన మార్క్ కామెంట్స్ చేసారు. జానారెడ్డి నాకు మంచి మిత్రుడు.. అయ్యో పాపం ఓడిపోతాడు అని బాధ తో అన్న అన్నారు. ఆంధ్ర వదిలేసి…తెలంగాణ కు వస్తా అంటూ సంచలన ప్రకటన చేసారు. తెలంగాణ వదిలిపెట్టి నష్టపోయాము అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఓటుకు 4 వేలు అయితది అన్నారు ఆయన. తాడిపత్రి లో పోటీ చెయ్యము అని నేను చెప్పినా… నామినేషన్ ను నా తమ్ముడు నాకు చెప్పకుండా వేయించాడు అన్నారు.

Also Read : కుప్పంలో వైఎస్సార్‌ విగ్రహం ధ్వంసం వెనుక ఎవరున్నారు..?

నామినేషన్ వేసి విత్ డ్రా చేసుకుంటే మాకు అంతకు మించి అవమానం ఉండదు అని అందుకే పోటీ చేయించా అన్నారు ఆయన. ఇక ఏపీ వదిలేసి తెలంగాణాకు వస్తా అని ఆయన చేసిన ప్రకటన సంచలనం అయింది. ఏపీ రాజకీయాల్లో ఆయన ప్రాధాన్యత బాగా తగ్గింది. టీడీపీ నేతలు జిల్లాలో ఆయన్ను పెద్దగా పట్టించుకోవడం లేదు. సోదరుడు జేసి ప్రభాకర్ రెడ్డి… జిల్లా నేతలకు నచ్చడం లేదు. అటు వైసీపీలోకి వెళ్ళడానికి ఎమ్మెల్యే కేతిరెడ్డి తో విభేదాలు ఉండటం తో వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారట.

ఇక ఇప్పుడు తెలంగాణాలో అడుగు పెడుతున్న నేపధ్యంలో ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనేది ఆసక్తిని రేపుతున్న అంశంగా చెప్పాలి. సిఎం కేసీఆర్ ను ఆయన కలవడంతో ఇప్పుడు ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. ఏపీ రాజకీయాలకు గుడ్ బై చెప్పి… ఆంధ్రా వాళ్ళు ఎక్కువగా ఉండే నియోజకవర్గం నుంచి తన కుమారుడుని ఎంపీ అభ్యర్ధిగా నిలబెట్టే ఆలోచనలో ఉన్నారనే టాక్ వెంటనే మొదలయింది. త్వరలోనే ఆయన తన రాజకీయ ప్రయాణం పై ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు.

ఉమ్మడి ఏపీలో తన సన్నిహితులను తెలంగాణాలో మళ్ళీ దగ్గర చేసుకుని అధికార పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉండవచ్చని తెలుస్తుంది. తనతో పాటు మంత్రి వర్గంలో పని చేసిన వారు ఇప్పుడు తెలంగాణా అధికార పార్టీలో కొనసాగుతున్న సంగతి విదితమే.

Also Read : వామ్మో తాడిపత్రిలో ఇంత మెజారిటీనా..? జేసీ వర్గంలో కలవరం

Show comments