థియేటర్ల డిమాండ్లు తీరే మార్గం ఉందా

పది నెలల లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకోవడం, జనం సంక్రాంతికి హౌస్ ఫుల్ బోర్డులు చేయించడం ఇండస్ట్రీనే కాదు సినిమా ప్రేమికులను కూడా ఆనందంలో ముంచెత్తుతోంది. అయితే తాజాగా టాలీవుడ్ లో ఎగ్జిబిటర్ల మధ్య రేగిన వివాదం కొత్త చర్చకు దారి తీస్తోంది. మల్టీ ప్లెక్సుల తరహాలో తమకూ పర్సెన్టేజ్ విధానాన్ని అమలు చేయాలని, రెంటల్స్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నట్టు సింగల్ స్క్రీన్ యజమానులు డిమాండ్ చేయడం పరిశ్రమ పెద్దలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఎందుకంటే అధిక శాతం సింగల్ స్క్రీన్లు మన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి.

నిన్న ఒక దఫా చర్చలు జరిగాయి కానీ ఇవాళ కూడా వాటిని కొనసాగించబోతున్నారు. ఒకవేళ ఇవి సఫలం కాకపోతే మార్చి 1 నుంచి సింగల్ థియేటర్లను మూసేసి నిరసన తెలియజేస్తామని ఇప్పటికే ప్రదర్శనకారులు అల్టిమేటమ్ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా జరిగితే చాలా ప్రమాదం. కొత్త సినిమాలు విడుదలలు వెనక్కు వెళ్తాయి. ఇప్పటికే రాబోయే షెడ్యూల్స్ చాలా టైట్ గా ఉన్నాయి. కొన్ని శుక్రవారాలు ఏకంగా నాలుగైదు చిత్రాలు పోటీ పడాల్సిన తీవ్రమైన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కనక తాత్కాలికంగా అయినా సరే ఇవి మూతబడితే మళ్ళీ కథ మొదటికే వస్తుంది. అందురు సీరియస్ డిస్కషన్లు జరుగుతున్నాయట.

ఈ రచ్చలో ఓటిటి టాపిక్ కూడా వచ్చింది. రవితేజ క్రాక్ కేవలం 25 రోజులు, విజయ్ మాస్టర్ కేవలం 16 రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ చేయడం వల్ల ఉన్నట్టుండి వసూళ్లు దభేలున కింద పడుతున్నాయని, దీని వల్ల ఫైనల్ రన్ అయ్యేలోపు లాభాల్లో కోత పడి కొన్నిసార్లు నష్టాలు కూడా చవిచూడాల్సి వస్తోందని అంటున్నారు. చిన్న సినిమాకు నెల రోజులు, పెద్ద సినిమా యాభై రోజులు ఓటిటి గ్యాప్ ఉండాలన్నది వాళ్ళ డిమాండ్. గతంలో డెన్నిస్ సంబంధించి నిర్ణయం తీసుకున్నారు కానీ ఏ నిర్మాతా పాటించలేదు. సో ఇప్పుడీ డిమాండ్ల పర్వం ఒక కొలిక్కి వస్తుందా లేదా అనేది ఈ రోజు లేదా రేపు తేలిపోతుంది

Show comments