Venkateswarlu
Venkateswarlu
ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదాలు భారీగా పెరిగిపోయాయి. దేశం ఈ మూల నుంచి ఆ మూల వరకు ఎక్కడో చోట నిత్యం అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. బహుళ అంతస్తుల భవనాల్లోనే అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా ఏటా వందల మంది మృత్యువాతపడుతున్నారు. తాజాగా, కర్ణాటక రాజధాని, సిలకాన్ సిటీ అయిన బెంగళూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగు అంతస్తుల భవనంలోని పబ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఆ వివరాల్లోకి వెళితే.. బెంగళూరు, కోరమంగలలోని ఫోరమ్ మాల్‌లోని నాలుగు అంతస్తుల భవనంలో పబ్ ఉంది. బుధవారం మధ్యాహ్నం ఈ పబ్‌లో కిచెన్‌లో సిలిండర్ పేలింది. దీంతో పబ్‌లో మంటలు చెలరేగాయి. అక్కడి వారు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకునే లోపు మంటలు పబ్‌నుంచి మిగిలిన అంతస్తుకు వ్యాపించింది. నాలుగు అంతస్తుల భవనం మొత్తం మంటల్లో తగలబడసాగింది. బిల్డింగ్ మొత్తం దట్టమైన పొగలు సైతం వ్యాపించాయి.
ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి మంటల్లో చిక్కుకుని బయటకు రావటానికి చాలా ఇబ్బంది పడ్డాడు. బిల్డింగ్ పైనుంచి కిందకు దూకాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ అతడ్ని వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఇక, ఫైర్ సిబ్బంది అతి కష్టం మీద మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.