మైదుకూరు ముస్లిం కుటుంబం ఎందుకు లైవ్ పెట్టింది ? ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంది?

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనందరి ప్రభుత్వం వచ్చాక.. అంటూ సీఎం జగన్‌ తన ప్రసంగాన్ని మొదలుపెట్టేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే మాటను తరచూ పలుకుతున్నారు. పలకడమే కాదు.. ఇది ప్రజల ప్రభుత్వమని తన చేతల ద్వారా నిరూపిస్తున్నారు. విప్లవాత్మకమైన పాలన, సంక్షేమ పథకాలే కాదు.. ఆపద సమయంలోనూ అండగా ఉంటున్నారు. తమకు ఆపద ఉందని బాధితులు ఏ మాధ్యమం ద్వారానైనా తెలియజేస్తే చాలు వెంటనే స్పందిస్తున్నారు. బాధితులకు న్యాయం చేస్తూ.. అండగా ఉంటున్నారు. తాజాగా వైఎస్సార్‌ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం ఎర్రబల్లెకు చెందిన మైనారిటీ కుటుంబం విషయంలోనూ సీఎం వైఎస్‌ జగన్‌ వేగంగా స్పందించారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని అధికారులుకు ఆదేశాలు జారీ చేశారు.

అసలేం జరిగింది…?

ఎర్రబల్లె గ్రామానికి చెందిన అక్బర్‌ బాషాకు స్థానికంగా ఏకరన్నర భూమి ఉంది. 2009లో దాన విక్రయం కింద ఆ భూమి అక్బర్‌ బాషాకు లభించింది. అయితే ఈ భూమిపై వివాదం తలెత్తడంతో అబ్బర్‌ బాషా స్పందన కార్యక్రమంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ సూచన మేరకు అక్బర్‌ మైదుకూరు గ్రామీణ సీఐ కొండారెడ్డిని కలిశారు. సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన సీఐ.. అవతల వ్యక్తికి మద్ధతుగా మారిపోయి, తమను బెదిరిస్తున్నారని అక్బర్‌ బాషా ఆరోపిస్తున్నారు. తమను ఎన్‌కౌంటర్‌ చేస్తానని బెదిరిస్తున్నారంటూ కుటుంబంతో కలసి ఓ సెల్పీ వీడియో తీసి దానిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. సీఐ ఎన్‌కౌంటర్‌ చేసే వరకు తాము బతికి ఉండమని, న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని ఆ వీడియోలో వాపోయారు. తమ సమస్యను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పరిష్కరించాలని విన్నవించారు.

వెంటనే స్పందించి సీఎం వైఎస్‌ జగన్‌..

అక్బర్‌ బాషా కుటుంబ సెల్పీ వీడియో ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరడంతో.. అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌.. సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. సీఎం వైఎస్‌ జగన్‌ సూచనతో ముఖ్యమంత్రి కార్యాలయం వైఎస్సార్‌ కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్‌కు తగిన ఆదేశాలు జారీ చేసింది. వెంటనే రంగంలోకి దిగిన ఎస్పీ అన్బురాజన్‌.. భూ వివాదంలో ఉన్న ఇరు వైపుల వారిని తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. అక్బర్‌ బాషా ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేసేందుకు అదనపు ఎస్పీ దేవ ప్రసాద్‌ను నియమించారు. సీఐ కొండా రెడ్డిని రెండు రోజుల పాటు విధుల నుంచి తొలగించారు.

Also Read : నీటి సదస్సులు కాదు.. కార్యకర్తల మీటింగ్‌ పెట్టాలంటున్న జేసీ

Show comments