Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ చర్రితలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప వ్యక్తిగా నిలిచిపోయారని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన వారికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్ అవార్డుల కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పౌర ప్రముఖులకు అవార్డులు అందించిన సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల కోసం వైఎస్సార్ చేసిన కృషిని కొనియాడారు. డాక్టర్ వృత్తి చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి.. విద్య, వైద్యం, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. ప్రజల నాడి తెలిసిన డాక్టర్‌గా.. వారి ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకం తెచ్చారని గుర్తు చేశారు. సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందించి వారి మనస్సులను గెలుచుకున్నారని గవర్నర్ కొనియాడారు.
సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. నేల పై ఉండి ఆకాశమంత ఎదిగిన దివంగత నేత వైఎస్సార్ పేరుపై అవార్డులు అందించాలని నిర్ణయించామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే భారత రత్న, పద్మ అవార్డుల మాదిరిగానే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా పౌర ప్రముఖులకు అవార్డులు ఇవ్వాలనే సూచనలు రావడంతో.. ఆ దిశగా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రచయితలు, రైతులు, జర్నలిస్టులు, కోవిడ్ ఫ్రంట్‌లైన్ వారియర్లను ఈ అవార్డులు ఎంపిక చేశామని తెలిపారు. ఎంపికలో వారు అందించిన సేవలును మాత్రమే పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు. వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారం కింద అవార్డు గ్రహీతకు 10 లక్షల రూపాయల నగదు, క్యాంస విగ్రహం, యోగ్యతా పత్రం, వైఎస్సార్ సాఫల్య అవార్డు గ్రహీతకు 5 లక్షల రూపాయల నగదు, క్యాంస విగ్రహం, యోగ్యతా పత్రం అందిస్తున్నామని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వివరించారు.
అవార్డులు అందుకున్న సంస్థలు, ప్రముఖులు..
ట్రస్టులు..
1. ఎంఎస్‌ఎన్ చారిటీస్ ట్రస్ట్ – కాకినాడ(తూర్పుగోదావరి)
2. సీపీ బ్రౌన్ లైబ్రరీ – వైఎస్సార్ జిల్లా
3. సారస్వత నికేతన్ లైబ్రరీ – వేటపాలెం(ప్రకాశం)
4. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ – పుట్టపర్తి(అనంతపురం)
5. ఆర్‌సీ రెడ్డి స్టడీ సర్కిల్ – వైఎస్సార్ జిల్లా
6. రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్(ఆర్‌డీటీ) – అనంతపురం
7. గౌతమి రీజనల్ లైబ్రరీ – తూర్పుగోదావరి
8. మహారాజా గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ – విజయనగరం
రైతులు..
9. స్వర్గీయ పల్లా వెంకన్న – కడియం(తూర్పుగోదావరి)
10. మాతోట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ – శ్రీకాకుళం
11. ఎంసీ రామకృష్ణారెడ్డి – అనంతపురం
12. కొట్యాడ శ్రీనివాసరావు – విజయనగరం
13. విఘ్నేశ్వర ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ – కృష్ణా జిల్లా
14. ఎం.బలరామి రెడ్డి – వైఎస్సార్ జిల్లా
15. ఎస్.రాఘవేంద్ర – చిత్తూరు
16. సెగ్గె కొండలరావు – విశాఖపట్నం
17. ఆంధ్ర కశ్మీర్ ట్రైబల్ ఫ్మారింగ్ ప్రొడ్యూసర్ కంపెనీ – విశాఖపట్నం
18. వల్లూరు రవికుమార్ – కృష్ణా జిల్లా
19. శివ అభిరామిరెడ్డి – నెల్లూరు జిల్లా
కళలు–సంస్కృతి..
20. పొందూరు ఖద్దర్(ఆంధ్రాపైన్ ఖాదీ కార్మికాభ్యుదయ సంఘం) – శ్రీకాకుళం
21. స్వర్గీయ వంగపండు ప్రసాదరావు(జానపద గేయం) – విజయనగరం
22. అచ్యుత నారాయణ(బొబ్బిలి వీణ కేంద్రం) – విజయనగరం
23. పొన్నాల రామసుబ్బారెడ్డి(రంగస్థలం) – నెల్లూరు
24. వినాయక నాట్యమండలి(సురభి నాటకం) – వైఎస్సార్ జిల్లా
25. సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం(కూచిపూడి నాట్యం) – కృష్ణా
26. దాలవాయి చలపతిరావు(తోలు బొమ్మలాట) – అనంతపురం
27. కిల్లు జానకమ్మ(థింసా నృత్య బృందం) – విశాఖ
28. సవర రాజు(సవర పెయింటింగ్స్) – శ్రీకాకుళం
29. మజ్జి శ్రీనివాసరావు(వీధి నాటకం) – విశాఖపట్నం
30. ధర్మాడి సత్యం(డిజాస్టర్ మేనేజ్‌మెంట్) – తూర్పుగోదావరి
31. సర్వారాయ హరికథ పాఠశాల (మహిళలు) – తూర్పుగోదావరి
32. మిరియాల అప్పారావు(బుర్రకథ) – పశ్చిమగోదావరి
33. కూరెళ్ల వెంకటాచారి(కొండపల్లి బొమ్మలు) – కృష్ణా
34. గోచిపాత గాలేబు(డప్పు కళాకారుడు) – కృష్ణా
35. జి.రమణయ్య(వెంకటగిరి జాంధానీ చీరలు) – నెల్లూరు
36. శివప్రసాద రెడ్డి(కళంకారీ పెయింటింగ్స్) – కర్నూలు
37. బాలాజీ ఉడ్ కార్వింగ్ ఆర్టిజన్స్ సొసైటీ – చిత్తూరు
38. డా.వి.సత్యనారాయణ(నాదస్వరం) – చిత్తూరు
39. పూసపాటి పరమేశ్వర్‌రాజు(కాలిగ్రఫీ) – విజయనగరం
సాహిత్యం..
40. స్వర్గీయ కాళీపట్నం రామారావు(కారా మాస్టర్) – శ్రీకాకుళం
41. కత్తి పద్మారావు – గుంటూరు
42. రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి – వైఎస్సార్ జిల్లా
43. బండి నారాయణ స్వామి – అనంతపురం
44. కేతు విశ్వనాథరెడ్డి – వైఎస్సార్ జిల్లా
45. కొలకలూరి ఇనాక్ – గుంటూరు
46. లలితా కుమారి(ఓల్గా) – గుంటూరు
జర్నలిజం..
47. ఏబీకే ప్రసాద్ – కృష్ణా
48. స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వరరావు – గుంటూరు
49. స్వర్గీయ ఖాజా హుస్సేన్ (దేవీప్రియ) – గుంటూరు
50. స్వర్గీయ కె.అమరనాథ్ – పశ్చిమగోదావరి
51. సురేంద్ర (కార్టునిస్ట్) – వైఎస్సార్ జిల్లా
52. ఇమామ్ – అనంతపురం
వైద్య–ఆరోగ్య విభాగం..
53. డాక్టర్ నీతి చంద్ర(ఊపిరితిత్తుల వ్యాధుల ప్రొఫెసర్) – నెల్లూరు
54. డాక్టర్ కె.కృష్ణ కిషోర్(ఈఎన్‌టీ ప్రొఫెసర్) – తూర్పుగోదావరి
55. లక్ష్మి(స్టాఫ్ నర్స్) – విజయవాడ
56. కె.జోతిర్మయి(స్టాఫ్ నర్స్) – అననంతపురం
57. తురబిల్లి తేజస్వి(స్టాఫ్ నర్స్) – విశాఖపట్నం
58. ఎం.యోబు(మేల్ నర్స్) – వైఎస్సార్ జిల్లా
59. ఆర్తి హోమ్స్ – వైఎస్సార్ జిల్లా
Also Read : YSR Awards – గౌతమి గ్రంథాలయానికి వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారం