ఆ ఒకే ఒక జడ్పీటీసీ ఇండిపెండెంట్ ఎలా గెలిచాడు?

అనంతపురం జిల్లానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా గత సార్వత్రిక ఎన్నికల నుండీ వైఎస్సార్సీపీ ప్రతీఎన్నికలోను ప్రభంజనం సృష్టిస్తూ కనీవినీ ఎరుగని విజయాలతో అప్రతిహతంగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే, ఫలితంగా ప్రతీఎన్నికలో ఆశావహుల సంఖ్యకూడా పెరగడం సహజమే కానీ స్వతంత్రంగా పోటీ చేయడానికి నాలుగు సార్లు ఆలోచించే రోజులు ఇవి. ఈ నేపథ్యంలో మొన్న జరిగిన ZPTC ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఒకే ఒక్కడు విజయం సాధించాడు, ఆయన ఎవరు ఆ కథామిషు ఏంటనేది తెలుసుకుందాం.

రాష్ట్రం చిట్టచివరి ప్రాంతం కన్నడ ప్రభావం ఎక్కువగా ఉండే మడకశిర నియోజకవర్గం ఉమ్మడి తెలుగు రాష్ట్రా రాజకీయ యవనికపై ప్రముఖ పాత్ర పోషించిన విషయం తెలిసిందే, స్థానికంగా రాజకీయ హేమాహేమీలు ఉన్నప్పటికీ వైఎస్సార్సీపీ ఆవిర్భావ రోజుల నుండీ నియోజకవర్గంలోని రోళ్ళ మండలానికి చెందిన అనంతరాజు అంటే తెలియని వైఎస్సార్సీపీ కార్యకర్త లేడు అంటే అతిశయోక్తికాదు, కారణం వైఎస్ఆర్ కుటుంభం పట్ల తనకున్న ప్రేమ, ఆ ప్రేమే పార్టీ ఆవిర్భావ తొలిరోజుల నుండీ నేటి వరకూ పార్టీ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కష్టపడేలా చేసింది అంటాడు,పార్టీ పరంగానే కాకుండా స్థానిక ప్రజలకు అనేక సేవా కార్యక్రమాల ద్వారా దగ్గర కావడం కూడా ఒక మంచి గుర్తింపుకు కారణం అంటాడు.

Also Read : టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోటా సైకిల్ కుదేలు

గత ప్రాదేశిక ఎన్నికల్లో రొళ్ళ మండలం వైఎస్ఆర్సీపీ తరఫున ZPTC గా పోటీచేసి కేవలం 300 ఓట్ల తేడాతో ఓటమి పొందాడు, అయితే ఎక్కడా నిరాశ చెందకుండా పార్టీ అభివృద్ధికి కష్టపడుతూ వచ్చాడు, ఈ క్రమంలో నియోజకవర్గ స్థాయిలో తమ సామాజిక వర్గం అయినటువంటి కుంచిటిగ సంఘం అధ్యక్షుడు గా ఎన్నిక కాబడ్డాడు. ఇంతవరకు బానే ఉంది కానీ మొన్న జరిగిన ZPTC ఎన్నికల్లో స్థానిక రాజకీయ సమీకరణాల వల్ల అనంతరాజుకు మొండిచెయ్యి చూపిస్తూ మాజీమంత్రి నర్సేగౌడ కొడుకు శివ ప్రసాద్ గారికి వైఎస్ఆర్సీపీ తరఫున ZPTC టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చింది.

అయితే స్థానికంగా ఉన్న తన కేడర్ ఒత్తిడిమేరకు ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చింది. స్థానిక వైఎస్సార్సీపీ నాయకుల అంచనాలను తలకిందులు చేస్తూ 5600 ఓట్ల మెజారిటీతో అనంతరాజు విజయం సాధించాడు. దీనంతటికీ కారణం వర్గాలకు అతీతంగా స్థానిక ప్రజల ఇచ్చిన మద్దతు వల్లనే ఈ విజయం అంటున్నాడు.

Also Read : టీడీపీ ఆ ఏడు జెడ్పిటిసీలు ఎలా గెలిచింది?

Show comments