రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక సిద్ధం

రాజధాని అమరావతి పేరిట టీడీపీ హయాంలో చోటుచేసుకున్న అవకతవకలు, చేపట్టాల్సిన చర్యలపై నిపుణుల కమిటీ నివేదికను సిద్ధం చేసింది. రెండు నెలలపాటు అధ్యయనం చేసి వందలాది ఫైళ్లను పరిశీలించి క్షేత్ర స్థాయిలో పనులను అంచనా వేసిన కమిటీ సభ్యులు సమగ్ర నివేదికను రూపొందించారు. రెండు, మూడు రోజుల్లో దీనిని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కమిటీ సమర్పించనుంది. వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన ఎఫ్‌సీఎస్‌ పీటర్, పొన్నాడ సూర్యప్రకాష్, అబ్దుల్‌ బషీర్, ఎల్‌.నారాయణరెడ్డి, ఐఎస్‌ఎన్‌ రాజు, ఆదిశేషు సభ్యులు ఈ కమిటీలో ఉన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు, భూ సమీకరణ పేరుతో సేకరించిన భూములను పరిశీలించి నిబంధనలకు విరుద్ధముగా చేసిన విషయాలను కనుగొని నివేదికలో పొందుపరిచినట్టు తెలిసింది.

Show comments