“X Roads” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది

హైదరాబాద్‌లోని హైటెక్ NAC ఆడిటోరియంలో యువ హీరోలు నటించిన "X Roads" సినిమా ప్రీ-రిలీజ్ ఘనంగా నిర్వహించబడింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి .

హైదరాబాద్‌లోని హైటెక్ NAC ఆడిటోరియంలో యువ హీరోలు నటించిన "X Roads" సినిమా ప్రీ-రిలీజ్ ఘనంగా నిర్వహించబడింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి .

”X Roads” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది

“X Roads” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని హైటెక్ NAC ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించబడింది. యువ హీరోలు నటిస్తున్న ఈ సినిమా మే 30న విడుదల కానుంది. ఈ సందర్బంగా సినిమాలోని పాటలు మరియు ట్రైలర్ విడుదల చేశారు. ఈ సినిమా పాటలు మరియు ట్రైలర్ ని దిగ్గజ దర్శకుడు కె. రఘవేంద్రరావు గారు మరియు నటుడు సుమన్ గారు వీడియో సందేశాల ద్వారా విడుదల చేశారు.

కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ”పెళ్లి చూపులు” చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి , మరియు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ డైరెక్టర్ రాజ్ రెడ్డి గారు హాజరయ్యారు. ఇక ఈ సినిమాకు నిర్మాతగా ఐశ్వర్య కృష్ణ ప్రియ, కో-ప్రొడ్యూసర్ గా దుశ్యంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.శశి ప్రీతమ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఇక ఈ కార్యక్రమం సినిమా తారాగణం, NAC విద్యార్థులు, మరియు SPACE అకాడమీ విద్యార్థుల సమక్షంలో ఘనంగా జరిగింది.”X Roads” – మిస్టరీ, డ్రామ భయం మరియు ఎమోషనల్ మేళవింపు గల ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని థియేటర్స్ లో అసలు మిస్ చేయకుండా చూడాల్సిన సినిమా అని మేకర్స్ చెప్పుకొచ్చారు. మే 30 న విడుదల కాబోతున్న ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments