రీరిలీజ్ లకు ప్రీమియర్స్.. అది బాబు రేంజ్

khaleja rerelease: ఖలేజ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కి అయితే ఆనందపడాలో ఆశ్చర్యపడాలో అర్థంకాని పొజిషన్ లో ఉన్నారు. రిరీలీజ్ కు వారం రోజుల ముందు నుంచే బుక్ మై షో లో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

khaleja rerelease: ఖలేజ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కి అయితే ఆనందపడాలో ఆశ్చర్యపడాలో అర్థంకాని పొజిషన్ లో ఉన్నారు. రిరీలీజ్ కు వారం రోజుల ముందు నుంచే బుక్ మై షో లో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

ఖలేజ మూవీ స్ట్రెయిట్ గా థియేటర్ లో రిలీజ్ అయినప్పుడు.. విపరీతంగా ట్రోలింగ్ చేశారు. ఇప్పుడు అదే సినిమా రీరిలీజ్ చేస్తుంటే మాత్రం ఒక్కొక్కరు పండగ చేసుకుంటున్నారు. ఈ అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే మహేష్ బాబు ఫ్యాన్స్ కి అయితే ఆనందపడాలో ఆశ్చర్యపడాలో అర్థంకాని పొజిషన్ లో ఉన్నారు. రిరీలీజ్ కు వారం రోజుల ముందు నుంచే బుక్ మై షో లో టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. మాములు స్ట్రెయిట్ రిలీజ్ లకు కూడా ఈ రేంజ్ లో అమ్ముడు పోలేదని టాక్. ఈ రేంజ్ లో బాబు హావ కొనసాగుతుంది.

టికెట్స్ అమ్ముడు పోవడమే ఆశ్చర్యం అనుకుంటే.. ఇక ఇప్పుడు పబ్లిక్ లో సినిమాకు పెరుగుతున్న క్రేజ్ చూసి ఓ రోజు ముందుగానే ప్రీమియర్స్ వేస్తున్నారు. ఆర్టిసి క్రాస్ రోడ్స్ లో టికెట్ రేట్ బ్లాకులో కనీసం అయిదు వందల నుంచి రెండు వేల రూపాయల మధ్యలో ఉండొచ్చని టాక్. ఇక అప్పట్లో థియేటర్ లో ఈ అద్భుతాన్ని మిస్ అయినా బ్యాచ్ అంతా ఇప్పుడు క్యూ కడుతున్నారు. ఇక ఈ వీక్ లో భైరవం సినిమా కూడా రిలీజ్ కు రెడీగా ఉంది. అయినా సరే ఖలేజ సినిమాకె ఎక్కువ స్క్రీన్స్ కేటాయించాల్సి వస్తుందట. దీనితో ఖలేజ రీరిలీజ్ ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఎగబడుతున్నవారిని కంట్రోల్ చేయడం కంటే.. ఇంకాస్త ఎక్కువ స్క్రీన్స్ పెంచడం బెటర్ అని అనుకుంటున్నారు. ఇదే కనుక జరిగితే ఖలేజ రీరిలీజ్ థియేట్రికల్ రన్ అయ్యేలోపు పది కోట్లు సంపాదించినా ఆశ్చర్యపోవాల్సిన పోవాల్సిన అవసరం లేదని టాక్. బాబు రేంజ్ ఇలా ఉంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments