మరో వివాదంలో తెలుగు IAS అధికారిణి రోహిణీ సింధూరి.. స్టార్ సింగర్ ఫిర్యాదు

Lucky Ali Compliant On IAS Officer Rohini Sindhuri.. కర్ణాటక క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణీ వరుస వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలుస్తుంది. గతంలో ఆమెపై తీవ్ర ఆరోపణలు చేసింది ఐపీఎస్ ఆఫీసర్ రూపా. ఆ గొడవ ఇంకా సద్దుమణగనే లేదు.. ఇప్పుడు ఆమెపై మరో ఫిర్యాదు అందింది.

Lucky Ali Compliant On IAS Officer Rohini Sindhuri.. కర్ణాటక క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణీ వరుస వివాదాల్లో చిక్కుకుని వార్తల్లో నిలుస్తుంది. గతంలో ఆమెపై తీవ్ర ఆరోపణలు చేసింది ఐపీఎస్ ఆఫీసర్ రూపా. ఆ గొడవ ఇంకా సద్దుమణగనే లేదు.. ఇప్పుడు ఆమెపై మరో ఫిర్యాదు అందింది.

ఐఏఎస్ రోహిణీ సింధూరి నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్నారు. కర్ణాటక క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్ అధికారిణి రోహిణీపై ఐపీఎస్ ఆఫీసర్ డి. రూపా మౌద్గిల్ సోషల్ మీడియా వేదికగా కొన్ని విమర్శలు చేసిన సంగతి విదితమే. ఆమె వ్యక్తిగత ఫోటోలను పోస్టు చేసి.. అక్రమాలకు పాల్పడుతుందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. రోహిణీ వర్సెస్ రూపా అన్నట్లుగా నడిచింది. కర్ణాటకలో ఇద్దరు మహిళా ఉన్నతాధికారులు గొడవ పడటం హాట్ టాపిక్ అయ్యింది. చివరకు ఈ పంచాయతీ సుప్రీంకోర్టుకు కూడా చేరిన సంగతి విదితమే. రూపాపై పరువు నష్టం దాఖలు చేసింది  రోహిణీ. మేలో కూడా దీనిపై విచారణ జరగ్గా, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే బదులు సయోధ్య కుదుర్చుకోవాలని అత్యున్నత న్యాయం  సూచించింది.

ఇప్పుడు తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది ఈ మహిళా ఐఏఎస్. కర్ణాటక ఐఏఎస్ అధికారిణి రోహిణీ సింధూరిపై ప్రముఖ బాలీవుడ్ సింగ్ లక్కీ ఆలీ ఫిర్యాదు చేశారు. తన భూమిని కబ్జా చేశారంటూ ఆమెపై లోకాయుక్తలో కంప్లెంట్ చేశాడు. ఈ మేరకు ఆ కాపీని ఎక్స్ ఖాతాలో షేర్ చేశాడు అలీ. బెంగళూరు శివారులోని యెలహంక ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ భూమిని ఐఏఎస్‌ రోహిణి, ఆమె భర్త సుధీర్‌ రెడ్డి, బంధువు మధుసూదన్‌ రెడ్డి ఆక్రమించారని ఆరోపించారు. ఈ కబ్జా చేయడంలో కొందరు పోలీసు అధికారులు సాయం చేశారని తెలిపారు. 2022లోనే దీనిపై తాను ఏసీపీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదని, స్థానిక పోలీసుల నుండి తనకు ఎలాంటి సహాయం అందడం లేదని వరుస ట్వీట్స్ చేశాడు.

అంతేకాకుండా యెలహంక ఏసీపీ మంజునాథ్‌, సర్వేయర్‌ మనోహన్‌ల హస్తం ఉందని ఆరోపించారు. తమ అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ.. రోహిణీ, ఆమె కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. అందుకే తాను లోకాయుక్త పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. ఈ మేరకు ఫిర్యాదు కాపీని ఆయన ఎక్స్‌ ఖాతాలో షేర్ చేశారు. కాగా, సింగర్ లక్కీ ఆలీ ఫిర్యాదుతో యెలహంక న్యూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, గతంలో ఐఏఎస్ అధికారిణీ రూపా కూడా రోహిణీపై ఇలాంటి ఆరోపణలు చేయడం గమనార్హం. ఆమె అక్రమాలకు పాల్పడుతుందని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతోనే తన పరువు పోయిందని ఆమెపై ఫైర్ అయ్యింది రోహిణీ.

Show comments