వీడియో: రేవ్ పార్టీ కేసు.. జైలు నుండి హేమ విడుదల

మే 19న బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్న సంగతి విదితమే. ఇందులో నటి హేమను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా

మే 19న బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్న సంగతి విదితమే. ఇందులో నటి హేమను కూడా పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా

బర్త్ డే పార్టీ ముసుగులో రేవ్ పార్టీ చేసుకున్న వంద మందికి పైగా ప్రముఖుల్ని బెంగళూరు పోలీసులు పట్టుకున్నారు. వీరిలో అత్యధికులు తెలుగు వాళ్లే. అందులో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్న సంగతి విదితమే. తొలుత హైదరాబాద్ ఫామ్ హౌస్‌లో ఉన్నానంటూ ఓ వీడియో చేసి కవర్ చేసుకునేందుకు ప్రయత్నించగా.. ఆమె రేవ్ పార్టీలోనే ఉందంటూ పిక్ విడుదల చేసి షాక్ ఇచ్చారు బెంగళూరు పోలీసులు. అందరి దగ్గర శాంపిల్స్ తీసుకుని విడిచిపెట్టారు. కాగా, 86 మందికి పాజిటివ్ రాగా, అందర్ని విచారణకు ఆదేశించారు. వారిలో హేమ కూడా ఉంది. అయితే వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నానని, విచారణకు హాజరు కాలేనని చెప్పింది. మరోసారి నోటీసులు ఇవ్వగా విచారణకు రాలేదు. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.. కోర్టులో హాజరు పరచగా.. జూన్ 14 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఈ కేసులో నటి హేమకు గురువారం బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో శుక్రవారం ఆమె జైలు నుండి విడుదలయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. హేమ నుండి డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని, హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని న్యాయ స్థానం దృష్టికి తీసుకెళ్లారు ఆమె తరుఫు న్యాయవాది. కాగా, హేమ పార్టీలో పాల్గొన్నట్లు ఆధారాలను బెంగళూరు సీసీబీ న్యాయవాది కోర్టుకు అందజేయడంతో వాదనలు విన్న ఎన్డీపీసీ స్పెషల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

మే 19న బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలోని ఓ ఫామ్ హౌస్‌లో వాసు అనే వ్యక్తి బర్త్ డే పేరుతో రేవ్ పార్టీని నిర్వహించాడు. అక్కడకు పెద్ద యెత్తున సెలబ్రిటీలు వెళ్లారు. అందులో ఎక్కువగా తెలుగు రాష్ట్రాలకు చెందిన వారున్నారు. నానా హంగామా చేయడంతో ఇరుగు పొరుగు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడకు చేరుకున్నారు. చూడగా.. అది రేవ్ పార్టీ అని తేలింది. సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారు. భారీ మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వీరిందరి బ్లడ్ శాంపిల్స్ పరీక్షించగా.. 86 మంది పాజిటివ్ అని తేలింది. వీరిలో ఎక్కువగా తెలుగు వ్యక్తులు ఉన్నట్లు వెల్లడించారు బెంగళూరు పోలీసులు. ఇందులో ప్రముఖ నటి హేమ కూడా ఉంది. ఆమెను అరెస్టు చేయగా.. తాజాగా బెయిల్ పై విడుదలైంది.

Show comments