DV Raju
త ఏడాది నవంబర్26 న ప్రముఖ వ్యాపార వేత్త జుల్ఫీ రావ్‌జీ కుమార్తె జైనబ్ రావ్‌జీతో అఖిల్ నిశ్చితార్థం సైలెంట్ గా జరిగిపోయింది. కింగ్ నాగ్ సోషల్ మీడియాలో ఈ ఫోట్స్ షేర్ చేయగానే ఒక్కోసారిగా అంతా షాక్ అయ్యారు. ఇక అప్పటినుంచి మళ్లీ వీళ్ళ ఊసు లేదు. కానీ ఇప్పుడు వీరి పెళ్లి తేదీ దాదాపు కన్ఫర్మ్ అయినట్లే అని అంటున్నారు.

అక్కినేని నాగార్జున ఇంట మరోసారి పెళ్లి భాజాలు వినిపించనున్నాయట. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే టాక్ నడుస్తుంది. అక్కినేని అఖిల్ వివాహ ముహూర్తం దాదాపు ఫిక్స్ అయినట్లే అని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. గత ఏడాది నవంబర్26 న ప్రముఖ వ్యాపార వేత్త జుల్ఫీ రావ్‌జీ కుమార్తె జైనబ్ రావ్‌జీతో అఖిల్ నిశ్చితార్థం సైలెంట్ గా జరిగిపోయింది. కింగ్ నాగ్ సోషల్ మీడియాలో ఈ ఫోట్స్ షేర్ చేయగానే ఒక్కోసారిగా అంతా షాక్ అయ్యారు. ఇక అప్పటినుంచి మళ్లీ వీళ్ళ ఊసు లేదు. కానీ ఇప్పుడు వీరి పెళ్లి తేదీ దాదాపు కన్ఫర్మ్ అయినట్లే అని అంటున్నారు. ఆ శుభ ఘడియ జూన్ 6వ తేదీ అని తెలుస్తుండటంతో, అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైనట్టేనని అభిమానులు సంబర పడుతున్నారు.
ఇండస్ట్రీలో అఖిల్ తీసిన సినిమాలు తక్కువే అయినా కూడా.. అఖిల్ కంటూ స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. అయ్యగారే నెంబర్ 1 అంటూ అఖిల్ ను పొగిడేస్తూ ఉంటారు. ప్రస్తుతం అఖిల్ దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు డైరెక్షన్‌లో ‘లెనిన్’ అనే టైటిల్‌తో ఒక పవర్-ప్యాక్డ్ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు. ఇక ఈసారి అఖిల్ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ వస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే ఈ పెళ్లి వార్తపై అక్కినేని కుటుంబం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.