అదిరిపోయిన అడవిశేష్ ‘డెకాయిట్’ ఫస్ట్ గ్లింప్స్‌

DACOIT Glimpse: కాస్త లేట్ అయినా కానీ సాలిడ్ కథలను పిక్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చే హీరోస్ లో అడవిశేష్ ఒకరు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో రెండు పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. వాటిలో ఒకటి డెకాయిట్ . ఆ సినిమా నుంచి క్రేజి అప్డేట్ ను రిలీజ్ చేశారు. అదేంటో చూసేద్దాం.

DACOIT Glimpse: కాస్త లేట్ అయినా కానీ సాలిడ్ కథలను పిక్ చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చే హీరోస్ లో అడవిశేష్ ఒకరు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో రెండు పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయి. వాటిలో ఒకటి డెకాయిట్ . ఆ సినిమా నుంచి క్రేజి అప్డేట్ ను రిలీజ్ చేశారు. అదేంటో చూసేద్దాం.

డెకాయిట్ సినిమాకు అడవి శేష్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ.. హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ అతనితో జత కడుతుంది. ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. అడవిశేష్ సినిమాలంటేనే చాలా డిఫరెంట్ కాన్సప్ట్స్ తో ఉంటూ ఉంటాయి. దీనితో ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్ వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.

‘డెకాయిట్’మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘మీరు అగ్నిని చూస్తారు. మీరు అందుకు గల ఉద్దేశ్యాన్ని చూస్తారు. మీరు డెకాయిట్ను చూస్తారు. ప్రేమ. కోపం. ప్రతీకారం’ అంతకుమించి చూస్తారంటూ గ్లింప్స్ కు క్యాప్షన్ ఇచ్చారు. ఇందులో ముఖ్యంగా అడివిశేష్ చాలా ఇంటెన్స్ లుక్స్ తో కనిపిస్తాడు. టీజర్ కట్ మాత్రం సినిమాపై అంచనాలను పెంచిందని చెప్పి తీరాల్సిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియా యార్లగడ్డ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఇంకా చాలానే సమయం ఉంది. ప్రస్తుతానికి రిలీజ్ చేసిన గ్లిమ్ప్స్ మాత్రం సినిమా మీద సాలిడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

హిట్ 2 తర్వాత అడవి శేష్ ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపిస్తున్న మూవీ ఇది. రీసెంట్ గా హిట్ 3 లో గెస్ట్ రోల్ లో కనిపించి మెప్పించాడు. ఇక ఇప్పుడు మరో స్ట్రెయిట్ మూవీతో వస్తుండడంతో అడవి శేష్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అడవి శేష్ గూఢచారి 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దానికంటే ముందు వస్తున్న డెకాయిట్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments