షాపులో మందు కొన్న యువతులు.. వీడియో షేర్‌ చేసిన నటి!

సోషల్‌ మీడియా సూపర్‌ యాక్టీవ్‌గా ఉండే నటీమణుల్లో కస్తూరి శంకర్‌ ఒకరు. ఈమె తనకు సంబంధించిన విషయాలను మాత్రమే కాకుండా.. కాంట్రవర్సీలకు దారి తీసే విషయాలను కూడా షేర్‌ చేస్తూ ఉంటారు. ఆమె పెట్టే కొన్ని పోస్టుల కారణంగా ​కొన్ని సార్లు సోషల్‌ మీడియాలో పెద్ద రచ్చ కూడా జరుగుతూ ఉంటుంది. ఆమెపై విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. అయినా కూడా ఆమె పోస్టులు పెట్టడం మాత్రం ఆపరు. తాజాగా, ఆమె తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసిన ఓ వీడియో.. పెట్టిన కామెంట్‌ వివాదాంశంగా మారింది.

ఇంతకీ సంగతేంటంటే.. నటి కస్తూరి శంకర్‌ నిన్న తన ట్విటర్‌ ఖాతాలో ఓ వీడియో షేర్‌ చేశారు. ఆ వీడియోలో ఇద్దరు యువతులు మద్యం షాపు దగ్గర నిల్చుని ఉన్నారు. ఓ అమ్మాయి కౌంటర్‌ దగ్గర నిల్చుని తన కావాల్సిన మద్యం ఆర్డర్‌ చేసింది. మరో అమ్మాయి పక్కన నిల్చుని ఉంది. షాపు సిబ్బంది వారికి కావాల్సిన మద్యం ఇవ్వగానే వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. దీన్నంతా ఓ వ్యక్తి వీడియో తీశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో మారింది. వైరల్‌గా మారిన వీడియోను కస్తూరి తన ఖాతాలో షేర్‌ చేశారు.

ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు కస్తూరిపై ఫైర్‌ అవుతున్నారు. ‘‘ మీరు ఇలాంటి వీడియోలు షేర్‌ చేసి సమాజానికి ఏం మెసేజ్‌ ఇస్తున్నారు’’..‘‘ మీకు సోషల్‌ మీడియాలో గొడవలు పెట్టడం తప్పితే.. వేరే పని ఏం లేదా?’’..‘‘ ఎవరి స్వేచ్ఛ వారిది.. మీరు వారి గురించి మాట్లాడటం తప్పు’’ అంటూ హితవు పలుకుతున్నారు. కాగా, కస్తూరి శంకర్‌.. ఫైట్‌ మాస్టర్‌ కనల్‌ కణ్ణన్‌ అరెస్ట్‌పై కూడా ఓ పోస్టు పెట్టారు. ఆయన చేసిన దాంట్లో తప్పేముందంటూ సపోర్టు చేశారు. మరి, కస్తూరి షేర్‌ చేసిన ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments