నిరుద్యోగులకు శుభవార్త.. RTCలో 2000 ఉద్యోగాలు భర్తీ.. త్వరలో నోటిఫికేన్‌

నిరుద్యోగులకు ఆర్టీసీ భారీ శుభవార్త చెప్పడానికి రెడీ అయ్యింది. త్వరలోనే 2000 డ్రైవర్‌, కండక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఆ వివరాలు..

నిరుద్యోగులకు ఆర్టీసీ భారీ శుభవార్త చెప్పడానికి రెడీ అయ్యింది. త్వరలోనే 2000 డ్రైవర్‌, కండక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఆ వివరాలు..

మన దేశంలో ప్రైవేటు కంపెనీల్లో ఎంత మంచి జీతం ఇచ్చే ఉద్యోగాలు ఉన్నా సరే.. చాలా మంది యువత మాత్రం.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని కలలు కంటారు. అందుకోసం కన్నవారిని, ఉన్న ఊరిని కాదనుకుని.. పట్టణాలకు వచ్చి.. సరిగా తినకుండా.. రాత్రింబవళ్లు కష్టపడి చదువుతూ.. ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడుతుంటారు. అయితే అందరికి గవర్నమెంట్‌ ఉద్యోగం వస్తుందా అంటే రాదు. ఎంతో శ్రమించడంతో పాటు.. కాస్తంత అదృష్టం కూడా ఉండాలి. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేది వందలు, వేలల్లో అయితే.. వాటికి పోటీ పడే వారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. అలా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. 2 వేల ఉద్యోగాల భర్తీకి త్వరోలనే నోటిఫికేషన్‌ వెల్లడించనుంది. ఆ వివరాలు..

నిరుద్యోగులకు టీఎస్‌ఆర్టీసీ భారీ శుభవార్త చెప్పింది. త్వరలోనే 2 వేల డ్రైవర్‌, కండ‍క్టర్ల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయనుంది. ప్రస్తుతం టీఎస్‌ఆర్టీసీలో డ్రైవర్‌, కండక్టర్ల కొరత తీవ్రంగా ఉంది. పైగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో బస్సులో విపరీతమైన రద్దీ ఏర్పడింది. దాంతో బస్సుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకుంటుంది. అయితే అందుకు సరిపడా సిబ్బంది లేదు. దాంతో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటుంది. ప్రస్తుతం ఆర్టీసీలో 2 వేల డ్రైవర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటితో పాటు మరి కొన్ని కండక్టర్‌ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. దాంతో సిబ్బందిని సమకూర్చే విషయంలో అధికారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం సంస్థలో రద్దీకి సరిపడా సిబ్బంది లేని కారణంగా.. త్వరలోనే ఆర్టీసీలో ఖాళీగా ఉన్న డ్రైవర్‌, కండక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఆదిశగా చర్యలు ప్రారంభించింది. అంతేకాక ఈ నోటిఫికేషన్‌ ద్వారా డ్రైవర్‌ ఉద్యోగంలోకి వచ్చే వ్యక్తి.. కండక్టర్‌ డ్యూటీ కూడా చేసేలా ఆర్టీసీ నిబంధనలను రూపొందిస్తున్నారని సమాచారం. దీని వల్ల ఖర్చు తగ్గుతుందనే ఉద్దేశంతో సంస్థ ఇలాంటి నిర్ణయం తీసుకోనుందట.

ఇక హైదరాబాద్‌ నగరంతో పాటు, శివార్లలోని కాలేజీలు, విద్యాసంస్థల టైమింగ్స్‌ ఒకేలా ఉండేలా మార్చాలని కోరుతూ.. ఆర్టీసీ ఇప్పటికే లేఖలు రాసింది. అందుకు అనుగుణంగా.. 1500 బస్సులను నడిపేందుకు ఆర్టీసీ రెడీ అవుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.

Show comments