Rail India Technical and Economic Service Limited Apprenticeship posts:కేంద్ర ప్రభుత్వ సంస్థ RITES లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు.. అర్హతలు ఏంటంటే?

కేంద్ర ప్రభుత్వ సంస్థ RITES లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు.. అర్హతలు ఏంటంటే?

మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నట్లైతే మీకిదే మంచి అవకాశం. రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్ అప్రెంటిస్‌షిప్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నట్లైతే మీకిదే మంచి అవకాశం. రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్ అప్రెంటిస్‌షిప్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

యువత ఉన్నత చదువులు చదువుకుని ఉన్నతమైన ఉద్యోగాలను సాధించాలని కలలు కంటుంటారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ప్రయత్నాలు మొదలుపెడతారు. ఆ ప్రయత్నంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎదుర్కోని లక్ష్యం దిశగా ప్రయాణిస్తారు. అలా ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి శుభవార్త. కేంద్ర ప్రభుత్వ సంస్థ పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. హరియాణా గురుగ్రామ్ లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

రైట్స్ లిమిటెడ్ సంవత్సరం పాటు అప్రెంటిస్ షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ప్రవేశాలను భర్తీ చేయనున్నది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (ఇంజినీరింగ్/నాన్-ఇంజినీరింగ్), డిప్లొమా అప్రెంటిస్ , ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలను భర్తీచేయనున్నారు. ఈ పోస్టులకు ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైనవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు డిసెంబరు 20 వరకు దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://www.rites.com/Career ను పరిశీలించాలని కోరారు.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం అప్రెంటిస్ పోస్టులు:

  • 257

కేటగిరీ వారీగా ఖాళీల వివరాలు:

గ్రాడ్యుయేట్ (ఇంజినీరింగ్) అప్రెంటిస్:

  • 117

విద్యార్హత:

  • సంబంధిత విభాగంలో నాలుగేళ్ల ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్:

  • ఎంపికైన వారికి నెలకు రూ.14,000 చెల్లిస్తారు.

గ్రాడ్యుయేట్ (నాన్-ఇంజినీరింగ్) అప్రెంటిస్:

  • 43

విద్యార్హత:

  • అభ్యర్థులు సంబంధిత విభాగంలో మూడేళ్ల డిగ్రీ (బీఏ/బీబీఏ/బీకామ్) ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్:

  • ఎంపికైన వారికి నెలకు రూ.14,000 చెల్లిస్తారు.

డిప్లొమా అప్రెంటిస్:

  • 28

విద్యార్హత:

  • అభ్యర్థులు సంబంధిత విభాగంలో మూడేళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్:

  • ఎంపికైన వారికి నెలకు రూ.12,000 చెల్లిస్తారు.

ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్:

  • 69

విద్యార్హత:

  • అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

స్టైపెండ్:

  • ఎంపికైన వారికి నెలకు రూ.10,000 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్

ఎంపిక ప్రక్రియ:

  • అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

అప్లికేషన్ ప్రారంభ తేదీ:

  • 01-12-2023

అప్లికేషన్ కు చివరితేది:

  • 20-12-2023

రైట్స్ లిమిటెడ్ అధికారిక వెబ్ సైట్:

https://www.rites.com/Career

Show comments