DSSSB Recruitment 2023: డిగ్రీ అర్హతతో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ. 34 వేల వరకు జీతం

డిగ్రీ అర్హతతో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ. 34 వేల వరకు జీతం

ప్రభుత్వ ఉద్యోగాలకు ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. పూర్తి వివరాలు మీకోసం..

ప్రభుత్వ ఉద్యోగాలకు ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. డిగ్రీ అర్హతతో వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. పూర్తి వివరాలు మీకోసం..

మన దేశంలో చదువుకున్న యువత ఎక్కువ. ఏటా వేల మంది గ్రాడ్యుయేట్స్ డిగ్రీ పట్టాలతో బయటకి వస్తున్నారు. అందువల్లనే ఉద్యోగాల విషయంలో కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. పోస్టులు వందల్లో ఉంటే ఆశావాహులు మాత్రం లక్షల్లో పోటీపడుతున్నారు. పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించడమంటే కత్తిమీద సాము చేసినట్లే. చదువు పూర్తైన తర్వాత ఉద్యోగం సాధించడం ప్రతి ఒక్కరి కల. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ఓ లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇలా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి శుభవార్త. డిగ్రీ అర్హతతో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ బోర్డు జైలు సంక్షేమ అధికారి, వెల్ఫేర్ అధికారి, ప్రొబేషన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాల భర్తీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 80 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 03 2024 వరకు అవకాశం కల్పించింది. అప్లై చేసుకోదలచిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం డీఎస్ఎస్ఎస్ బీ అధికారిక వెబ్ సైట్ https://dsssbonline.nic.in ను పరిశీలించాలని కోరింది.

ముఖ్యమైన సమాచారం:

ప్రభుత్వ సంస్థ:

  • ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డ్

మొత్తం పోస్టులు:

  • 80

పోస్టుల వివరాలు:

  • జైలు సంక్షేమ అధికారి, వెల్ఫేర్ అధికారి, ప్రొబేషన్ ఆఫీసర్

డిపార్ట్ మెంట్:

  • ఉమెన్ అండ్ చైల్డ్, మరియు సోషల్ వెల్ఫేర్

కేటగిరీల వారిగా పోస్టులు:

  • అన్ రిజర్వుడ్ 37, ఓబీసీ 20, ఎస్సీ 07, ఎస్టీ 03, 13 ఈడబ్య్లూఎస్.

విద్యార్హత:

  • అభ్యర్థులు సోషల్ వర్క్ లేదా సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీని కలిగి ఉండాలి. లేదా క్రిమినాలజీలో డిప్లొమా. సెకండీర లెవల్ లో హిందీ సబ్జెక్ట్ పాసై ఉండాలి.

వయసు:

  • అభ్యర్థల వయసు 30 ఏళ్లు మించకూడదు. రిజర్వుడ్ కేటగిరీల వారికి వయసు సడలింపు ఉంటుంది.

ఫీజు:

  • రూ. 100 చెల్లించాలి. మహిళా అభ్యర్థులకు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

జీతం:

  • ఎంపికైన అభ్యర్థులకు రూ. 9, 300 నుంచి 34,800 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

అప్లికేషన్ ప్రారంభ తేదీ:

  • 05-12-2023

అప్లికేషన్ కు చివరి తేదీ:

  • 03-01-2024

డీఎస్ఎస్ఎస్ బీ అధికారిక వెబ్ సైట్:

Show comments