Income Tax Recruitment 2023:Income Tax డిపార్ట్‌మెంట్ లో ఉద్యోగాలు.. వీరు మాత్రమే అర్హులు!

Income Tax డిపార్ట్‌మెంట్ లో ఉద్యోగాలు.. వీరు మాత్రమే అర్హులు!

ప్రభుత్వ ఉద్యోగా కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆదాయపన్నుశాఖ తీపి కబురును అందించింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రభుత్వ ఉద్యోగా కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆదాయపన్నుశాఖ తీపి కబురును అందించింది. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతలతో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మీరు టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? గవర్నమెంట్ ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి వారికి భారీ శుభవార్త. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆదాయపన్నుశాఖ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ దేశంలో పన్ను చట్టాలను అమలు చేసి పన్నులను వసూలు చేస్తుంటుంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఐటీ శాఖలో మీరు ఉద్యోగం సాధించే అవకాశం వచ్చింది. మంచి జీతంతో పాటు కేంద్ర ప్రభుత్వ కొలువును సాధించి జీవితంలో సెటిల్ అయిపోవచ్చు. అయితే ఈ ఉద్యోగాలు వారికి మాత్రమే కేటాయించబడ్డాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ముంబయిలోని ఆదాయపన్ను శాఖ స్పోర్ట్స్ కోటా కింద పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 291 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టులను అనుసరించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వివిధ క్రీడలకు సంబంధించిన క్రీడాకారులకు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్ధులు జనవరి 19 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఐటీ శాఖ అధికారిక వెబ్ సైట్ https://incometaxmumbai.gov.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

  • స్పోర్ట్స్ కోటా పోస్టులు
  • మొత్తం పోస్టులు:
  • 291

విభాగాల వారీగా ఖాళీలు:

ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం‌టాక్స్ (ఐటీఐ):

  • 14 పోస్టులు

స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II (స్టెనో):

  • 18 పోస్టులు

టాక్స్ అసిస్టెంట్ (టీఏ):

  • 119 పోస్టులు

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్‌):

  • 137 పోస్టులు

క్యాంటీన్ అటెండెంట్ (సీఏ):

  • 03 పోస్టులు

విద్యార్హతలు:

  • ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం‌టాక్స్ పోస్టులకు అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన విద్యలో ఉత్తీర్ణులై ఉండాలి.
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II పోస్టులకు అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
  • ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థులు గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అభ్యర్థులు పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.
  • క్యాంటీన్ అటెండెంట్ పోస్టులకు అభ్యర్థులు పదోతరగతి లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం‌టాక్స్ పోస్టులకు అభ్యర్థులు వయోపరిమితి: 01-01-2023 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II పోస్టులకు అభ్యర్థులు 01-01-2023 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థులు 01-01-2023 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అభ్యర్థులు 01-01-2023 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • క్యాంటీన్ అటెండెంట్ పోస్టులకు అభ్యర్థులు 01-01-2023 నాటికి 18-25 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం:

  • ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం‌టాక్స్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.44,900 – రూ.1,42,400.
  • స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.25,500 – రూ.81,100.
  • ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.25,500 – రూ.81,100.
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.18,000 – రూ.56,900.
  • క్యాంటీన్ అటెండెంట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.18,000 – రూ.56,900.

క్రీడాంశాలు:

  • ఆర్చరీ, మల్లఖాంబ్, అథ్లెటిక్స్, మోటార్ స్పోర్ట్స్, అత్యాపత్యా, నెట్ బాల్, బ్యాడ్మింటన్, పారా స్పోర్ట్స్ (పారా-ఒలింపిక్స్, పారా ఏషియన్ గేమ్స్‌లో చేర్చబడిన క్రీడా క్రమశిక్షణ కోసం), బాల్-బ్యాడ్మింటన్, పెన్కాక్ సిలాట్, బేస్‌బాల్, పోలో, బాస్కెట్‌బాల్, పవర్ లిఫ్టింగ్, బిలియర్డ్స్ & స్నూకర్స్, షూటింగ్, బాడీ-బిల్డింగ్, షూటింగ్ బాల్, బాక్సింగ్, రోల్ బాల్, వంతెన, రోలర్ స్కేటింగ్ తదితర క్రీడాంశాలున్నాయి.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ.200 చెల్లించాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • అభ్యర్థులు క్రీడాంశాల్లో ప్రతిభ ఆధారంగా.

దరఖాస్తు ప్రారంభం:

  • 22-12-2023

దరఖాస్తుకు చివరితేదీ:

  • 19-01-2024.

ఐటీ శాఖ అధికారిక వెబ్ సైట్: https://incometaxmumbai.gov.in

Show comments