GGH Guntur Recruitment 2023: 7thతో చదువు ఆపేసినా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. 23 వేల జీతం

7thతో చదువు ఆపేసినా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ. 23 వేల జీతం

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురును అందించింది. గుంటూరు జిల్లాలోని మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పారామెడికల్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురును అందించింది. గుంటూరు జిల్లాలోని మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న పారామెడికల్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

మీరు 7వ తరగతి పాసయ్యారా? ఏడవ తరగతితో చదువు ఆపేయాల్సి వచ్చిందా? అయినా పర్లేదు. మీ కోసం నెలకు 23 వేలు జీతం ఇచ్చే ఉద్యోగాలు ఉన్నాయి. అది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. 7వ తరగతి నుంచి పీజీ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యం ఉన్న వారు ఈ నోటిఫికేషన్ ను అసలు వదలొద్దు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే పోస్టులను బట్టి రూ. 15 వేల నుంచి రూ. 61 వేల వరకు జీతం పొందొచ్చు. ఏడో తరగతి పాసైన వారు నెలకు 23 వేలు జీతంగా పొందవచ్చు.

గుంటూరులోని హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ జిల్లాలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న పారామెడికల్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 94 ఉద్యోగాలన కాంట్రాక్ట్/ ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. గుంటూరులోని జీఎంసీ, జీజీహెచ్‌, ప్రిన్సిపల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లో ఈ ఖాళీలున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 30 2023 వరకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం గుంటూరు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిక వెబ్ సైట్ ను https://guntur.ap.gov.in/ పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పారామెడికల్ పోస్టులు:

  • 94

విభాగాల వారీగా పోస్టుల వివరాలు:

  • ల్యాబ్ టెక్నీషియన్- 04, అనస్థీషియా టెక్నీషియన్- 02, బయోమెడికల్ టెక్నీషియన్- 01, సీటీ టెక్నీషియన్- 02, ఈసీజీ టెక్నీషియన్- 01, ఎలక్ట్రీషియన్ – 03, రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్/ మెడికల్ ఫిజిసిస్ట్- 01, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్- 01, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నీషియన్- 02, రేడియోగ్రాఫర్ – 02, రేడియోథెరపీ టెక్నీషియన్- 06, ఈఎమ్‌టీ టెక్నీషియన్ సీఎం కాన్వాయ్- 01, ఆఫీస్ సబార్డినేట్‌లు/అటెండర్లు- 07, జనరల్ డ్యూటీ అటెండర్లు- 31, స్టోర్ కీపర్- 01, మౌల్డ్ టెక్నీషియన్(సీనియర్)- 01, మౌల్డ్ టెక్నీషియన్(జూనియర్)- 01, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్- 01, పర్సనల్ అసిస్టెంట్- 01, జూనియర్ అసిస్టెంట్/ కంప్యూటర్ అసిస్టెంట్- 04, డీఈఓ/కంప్యూటర్ ఆపరేటర్- 03, రిసెప్షనిస్ట్ కమ్ క్లర్క్- 01, అసిస్టెంట్ లైబ్రేరియన్ – 01, హౌస్‌కీపర్స్/వార్డెన్స్- 02, క్లాసు రూం అటెండంట్స్- 01, డ్రైవర్స్ హెవీ వెహికల్- 04, డ్రైవర్స్( సీఎం కాన్వాయ్)- 01, ఆయా- 01, ల్యాబ్ అటెండంట్స్- 01, లైబ్రరీ అటెండంట్స్- 01, ఓటీ అసిస్టెంట్- 04, ప్లంబర్- 01 పోస్టులు ఉన్నాయి.

అర్హత:

  • పోస్టును అనుసరించి 7వ తరగతి, పదో తరగతి, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. పోస్టులననుసరించి సంబందిత విభాగలో అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 42 సంవత్సరాలు మించకూడదు. ఆయా కేటగరీల వారిక వయోసడలింపు ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు:

  • ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

అప్లికేషన్ విధానం:

  • ఆఫ్‌ లైన్‌

ఎంపిక ప్రక్రియ:

  • అకడమిక్ మార్కులు, వెయిటేజీ తదితరాల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

అప్లికేషన్ పంపించాల్సిన చిరునామా:

  • ది ప్రిన్సిపల్ ఆఫీస్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గుంటూర్.

అప్లికేషన్ ప్రారంభం:

  • 21-12-2023

అప్లికేషన్ చివరి తేదీ:

  • 30-12-2023.

గుంటూరు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిక వెబ్ సైట్:

Show comments