Steel Authority of India Limited Recruitment 2023టెన్త్, ఐటీఐ అర్హతతో సెయిల్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 26 వేల జీతం!

టెన్త్, ఐటీఐ అర్హతతో సెయిల్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 26 వేల జీతం!

ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ అర్హతతో ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు గుడ్ న్యూస్. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ అర్హతతో ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడమంటే కత్తిమీద సాము చేసినట్లే. ప్రభుత్వ ఉద్యోగాలను పొందాలంటే ఎంతో కష్ట పడాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు విడుదల చేసే నోటిఫికేషన్లలో పోస్టులు వందల్లో ఉంటే అభ్యర్థులు మాత్రం లక్షల్లో పోటీపడుతున్నారు. దీనిని బట్టి తెలుసుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగాలకు ఉండే ప్రాధాన్యత ఏంటువంటిదో. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు శుభవార్త అందించింది సెయిల్ సంస్థ. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రూర్కెలా ప్లాంట్‌లో ఖాళీగా ఉన్న పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రూర్కెలా ప్లాంట్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 110 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆ ఖాళీల్లో ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ (బాయిలర్ ఆపరేటర్), ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ మరియు అటెండెంట్-కమ్-టెక్నీషియన్ (ట్రైనీ), ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, డీజిల్ మెకానిక్ సహా పలు పోస్టుల పలు పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం సెయిల్ అధికారిక వెబ్‌సైట్‌ను sailcareers.com సందర్శించడం ద్వారా తెలుసుకోవచ్చు.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 110

పోస్టుల వివరాలు:

  • ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ (బాయిలర్ ఆపరేటర్)-20
  • ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ (ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్)-10
  • అటెండెంట్-కమ్-టెక్నీషియన్ (ట్రైనీ) – 80
  • ఎలక్ట్రీషియన్-25
  • ఫిట్టర్-28
  • ఎలక్ట్రానిక్స్-10
  • మెషినిస్ట్-10
  • డీజిల్ మెకానిక్-04
  • COPA/IT- 04

అర్హత:

  • ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ (బాయిలర్ ఆపరేటర్)- ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి మెకానికల్ / ఎలక్ట్రికల్ / కెమికల్ / పవర్ ప్లాంట్ / ప్రొడక్షన్ / ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విభాగంలో 03 సంవత్సరాల (పూర్తి సమయం) డిప్లొమాతో మెట్రిక్యులేషన్. అలాగే ఫస్ట్ క్లాస్ బాయిలర్ అటెండెంట్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
  • అటెండెంట్-కమ్-టెక్నీషియన్ (ట్రైనీ) – ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి మెకానిక్/కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామ్ అసిస్టెంట్ (COPA)/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)/ఎలక్ట్రీషియన్/ఫిట్టర్/ఎలక్ట్రానిక్స్/మెషినిస్ట్/డీజిల్ సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ (రెగ్యులర్) ఉండాలి. దానితో పాటు మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్.

శారీరక ప్రమాణాలు:

  • పురుష అభ్యర్థులు 155 సెం.మీ ఎత్తు, 45 కేజీల బరువు ఉండాలి. మహిళా అభ్యర్థులు 143 సెం.మీ ఎత్తు, 35 కిలోల బరువు కలిగి ఉండాలి.

జీతం:

  • ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ (బాయిలర్ ఆపరేటర్/ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్)పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 26,600, అటెండెంట్-కమ్-టెక్నీషియన్ (ట్రైనీ) కోసం ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం శిక్షణ కోసం రూ. 12,900 మరియు రెండవ సంవత్సరం రూ. 15,000 కన్సాలిడేటెడ్ జీతం అందిస్తారు.

వయసు:

  • ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ (బాయిలర్ ఆపరేటర్ పోస్టులకు 18 నుంచి 30 సంవత్సరలు కలిగి ఉండాలి.
  • ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ ఎలక్ట్రికల్ సూపర్‌వైజర్ పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాలు.
  • అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాలు.

ఎంపిక ప్రక్రియ:

  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • ఆపరేటర్-కమ్-టెక్నీషియన్ పోస్ట్: జనరల్/ఓబీసీ/ఈడబ్య్లూఎస్ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ/ఎస్టీ/పీడబ్య్లూడీ/ఈఎస్ఎమ్/డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు రూ. 150.
    అటెండెంట్-కమ్-టెక్నీషియన్ (ట్రైనీ): జనరల్/ఓబీసీ/ఈడబ్య్లూఎస్ అభ్యర్థులకు రూ. 300, ఎస్సీ/ఎస్టీ/పీడబ్య్లూడీ/ఈఎస్ఎమ్/డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు రూ. 100.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 20-11-2023

దరఖాస్తు చివరి తేదీ:

  • 16-12-2023

అధికారిక వెబ్ సైట్

Show comments