IDBI Recruitment 2023 invites online applications for Manager posts: IDBI బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు రూ. 89 వేల వరకు జీతం

IDBI బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు రూ. 89 వేల వరకు జీతం

మీరు బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లైతే మీకు శుభవార్త. ప్రముఖ ఐడీబీఐ బ్యాంకు మేనేజర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాలు మీకోసం..

మీరు బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లైతే మీకు శుభవార్త. ప్రముఖ ఐడీబీఐ బ్యాంకు మేనేజర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాలు మీకోసం..

ప్రస్తుతం ఏ రంగంలో చూసుకున్న కాంపిటీషన్ విపరీతంగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు లక్షలాది మంది పోటీపడుతున్నారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ జాబ్స్ కు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందించింది ప్రముఖ బ్యాంకు. బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఇదొక సువర్ణావకాశం. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బ్యాంక్ ఉద్యోగమే లక్ష్యంగా సన్నద్ధమయ్యే వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రముఖ బ్యాంకు ఐడీబీఐ మేనేజర్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా ఐడీబీఐ మేనేజర్ గ్రేడ్-బి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ వంటి పోస్టులను భర్తీ చేస్తుంది. డిగ్రీ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచే అనగా డిసెంబర్ 09 2023 నుంచి ప్రారంభమైంది. అప్లికేషన్ ప్రక్రియ డిసెంబర్ 25తో ముగుస్తుంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోంస ఐడీబీఐ అధికారిక వెబ్ సైట్ https://www.idbibank.in/ ను పరిశీలించాలని కోరింది.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఖాళీలు:

  • 86

పోస్టుల వివరాలు:

  • మేనేజర్ గ్రేడ్-బి విభాగంలో 46 పోస్టులు.
  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్-39.
  • డిప్యూటీ జనరల్ మేనేజర్ 01 పోస్టు ఉన్నాయి.

అర్హత:

  • పోస్టులను అనుసరించి బ్యాచిలర్ డిగ్రీ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి

వయోపరిమితి:

  • డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు దరఖాస్తు చేసుకుంటే అభ్యర్థుల వయసు 2023 నవంబర్ 1 నాటికి 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు 28 నుంచి 40 ఏళ్లు, మేనేజర్ పోస్టుకు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

అప్లికేషన్ ఫీజు:

  • జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.1000 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, అభ్యర్థులు రూ.200 చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ:

  • అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ముందు ప్రిలిమినరీ స్క్రీనింగ్, రెండో దశలో గ్రూప్ డిస్కషన్, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటాయి. మూడు దశల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి పోస్టింగ్ ఇస్తారు.

జీతం:

  • మేనేజర్ గ్రేడ్-బి పోస్టుకు ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.48,170 నుంచి రూ.69,810 వరకు ఉంటుంది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గ్రేడ్ సి పోస్టుకు రూ.63,840 నుంచి రూ.78230, డిప్యూటీ జనరల్ మేనేజర్ గ్రేడ్ డి పోస్టుకు రూ.76010 నుంచి రూ.89,890 వరకు జీతం లభిస్తుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 09-12-2023

దరఖాస్తు చివరి తేదీ:

  • 25-12-2023

ఐడీబీఐ అధికారిక వెబ్ సైట్:

Show comments