AIIMS Bibinagar Recruitment 2023: బీబీనగర్‌ AIIMSలో ఉద్యోగాలు.. అర్హతలు ఏంటంటే?

బీబీనగర్‌ AIIMSలో ఉద్యోగాలు.. అర్హతలు ఏంటంటే?

వైద్య విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి శుభవార్త. హైదరాబాద్ బీబీనగర్ ఎయిమ్స్ సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాలు మీకోసం..

వైద్య విద్యను పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి శుభవార్త. హైదరాబాద్ బీబీనగర్ ఎయిమ్స్ సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాలు మీకోసం..

ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందాలంటే ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయాలి. అవసరమైన వైద్య సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు కూడా వైద్య రంగంపై దృష్టి సారిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలను తీసుకుంటున్నాయి. ఆసుపత్రుల్లో కావాల్సిన వైద్య పరికరాలను, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌ బీబీనగర్ లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

వైద్య విద్య పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు హైదరాబాద్‌ బీబీనగర్ ఎయిమ్స్ గుడ్ న్యూస్ అందించింది. 151 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియను చేపట్టింది. ఈ పోస్టులకు ఎండీ, ఎస్, డీఎం, ఎంసీహెచ్‌తోపాటు సంబంధిత విభాగంలో డీఎన్‌ విద్యార్హత ఉన్నవారు అప్లై చేసుకోవడానికి అర్హులు. ఎంసీఐ/ఎన్‌ఎంసీ/స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యత్వం తప్పనిసరిగా కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. డిసెంబర్ 19 వరకు అప్లికేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఎయిమ్స్ అధికారిక వెబ్ సైట్ https://aiimsbibinagar.edu.in/ ను పరిశీలించాలని కోరింది.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల వివరాలు:

  • సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు

మొత్తం ఖాళీలు:

  • 151

విభాగాలవారీగా ఖాళీలు:

  • అనస్తీషియాలజీ-05, అనాటమీ-04, బయోకెమిస్ట్రీ-04, సీఎఫ్‌ఎం-06, డెన్‌టిస్ట్రీ-03, డెర్మటాలజీ-02, ఈఎన్‌టీ-04, ఎఫ్‌ఎంటీ-03, జనరల్ మెడిసిన్ & మెడికల్ సూపర్ స్పెషాలిటీస్-23, జనరల్ సర్జరీ & సర్జికల్ సూపర్ స్పెషాలిటీస్-28, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్-02, మైక్రోబయాలజీ-04, న్యూక్లియర్ మెడిసిన్-03, ఓబీజీ-06, ఆప్తాల్మాలజీ-04, ఆర్థోపెడిక్స్-04, పీడియాట్రిక్స్&నియోనటాలజీ-09, పాథాలజీ-04, ఫార్మకాలజీ-02, ఫిజికల్ మెడిసిన్ & రిహాబిలిటేషన్-02, ఫిజియాలజీ-04, సైకియాట్రీ-04, పల్మొనరీ మెడిసిన్-02, రేడియో డయాగ్నసిస్-08, రేడియోథెరపీ-02, ట్రాన్స్‌ఫ్యూషియన్ మెడిసిన్-05, ట్రామా & ఎమర్జెన్సీ మెడిసిన్-04.

విద్యార్హతలు:

  • ఎండీ/ఎంఎస్/డీఎం/ఎంసీహెచ్. సంబంధిత విభాగంలో డీఎన్‌తోపాటు ఎంసీఐ/ఎన్‌ఎంసీ/స్టేట్ మెడికల్ కౌన్సిల్ సభ్యత్వం ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 19-12-2023 నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు. కేటగిరీల వారిగా వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

దరఖాస్తు ఫీజు:

  • జనరల్‌ అభ్యర్థులు రూ.1770, ఈడబ్ల్యూఎస్‌ రూ.1416, చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం:

  • ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. రాతపరీక్షలో అర్హత సాధించిన వారికి 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.

వేతనం:

  • లెవల్-11 పే మ్యాట్రిక్స్ (7th CPC) కింద జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు చివరి తేదీ:

  • 19-12-2023

ఇంటర్వ్యూ తేదీలు:

  • 21-12-2023 నుంచి 23-12-2023 వరకు ఇంటర్య్వూలు నిర్వహిస్తారు.

బీబీనగర్ ఎయిమ్స్ అధికారిక వెబ్ సైట్:

https://aiimsbibinagar.edu.in/

Show comments