Central University Recruitment Exam NTA CUET 2023: కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలు.. నెలకు రూ. 81 వేల వరకు జీతం

కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాలు.. నెలకు రూ. 81 వేల వరకు జీతం

మీరు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారికి నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ శుభవార్తను అందించింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 150 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

మీరు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వారికి నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ శుభవార్తను అందించింది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 150 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించే అవకాశం మళ్లీ మళ్లీ రాదు. అవకాశం వచ్చినప్పుడే వినియోగించుకోవాలి. ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే వారికి గొప్ప అవకాశం. గవర్నమెంట్ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న వారికి నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ గుడ్ న్యూస్ అందించింది. దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఉన్న ఖాళీలను రెగ్యూలర్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీ రిక్రూట్ మెంట్ ఎగ్జామినేషన్ 2023 నోటిఫికేషన్ ను ఎన్టీఏ విడుదల చేసింది.

ఈ రిక్రూట్ మెంట్ ద్వారా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో నాన్ టీచింగ్ నియామకాలు భర్తీ చేయనున్నారు. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో)లో 102 పోస్టులు ఉన్నాయి. మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ, మోతిహారిలో 48 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 150 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకు విద్యార్హతలు పదోతరగతి, 10+2, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా తదితర కోర్సులు ఉత్తీర్ణులైన వారు అర్హులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు అప్లై చేసుకునేందుకు డిసెంబరు 21 వరకు అవకాశం కల్పించారు. పూర్తి వివరాలకు ఎన్టీఏ అధికారి వెబ్ సైట్ https://exams.nta.ac.in/CUREC/ ను పరిశీలించాలని కోరారు.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఖాళీలు:

  • 150

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) న్యూఢిల్లీ:

  • 102

పోస్టుల వివరాలు:

జూనియర్ అసిస్టెంట్-కమ్ టైపిస్ట్:

  • 50

అర్హత:

  • 10+2 లేదా తత్సమాన విద్యార్హత, టైపింగ్ పరీక్ష: కంప్యూటర్‌లో ఆంగ్లం-40 w.p.m స్పీడ్, హిందీ- 35 w.p.m స్పీడ్ టైపింగ్ ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 18-27 సంవత్సరాలు ఉండాలి.

వేతనం:

  • రూ. 19900- రూ. 63200 లెవెల్ 02

స్టెనోగ్రాఫర్:

  • 52

అర్హత:

  • 10+2 లేదా తత్సమాన విద్యార్హత, టైపింగ్ పరీక్ష: కంప్యూటర్‌లో ఆంగ్లం-40 w.p.m స్పీడ్, హిందీ- 35 w.p.m స్పీడ్ టైపింగ్ ఉండాలి. షార్ట్‌హ్యాండ్ టెస్ట్ @ 80 w.p.m. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 18-30 సంవత్సరాలు ఉండాలి.

వేతనం:

  • రూ.25,500 – రూ.81,100 (లెవెల్ 04

అప్లికేషన్ ఫీజు:

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఫీమేల్, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.600.

మహాత్మా గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ, మోతిహారి(బిహార్):

  • 48

పోస్టుల వివరాలు:

  • సిస్టం అనలిస్ట్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, హిందీ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్), ప్రైవేట్ సెక్రటరీ, సెక్యూరిటీ ఆఫీసర్, హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ఇంజినీర్(సివిల్), జూనియర్ ఇంజినీర్(ఎలక్ట్రికల్), పర్సనల్ అసిస్టెంట్, ప్రొఫెషనల్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి.

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తులు ప్రారంభం:

  • 01-12-2023

దరఖాస్తుకు చివరితేది:

  • 21-12-2023

ఎన్టీఏ అధికారిక వెబ్ సైట్:

https://exams.nta.ac.in/CUREC/

Show comments