AP Women and Child Welfare Department Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APలోని ఆ శాఖలో భారీగా ఉద్యోగాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APలోని ఆ శాఖలో భారీగా ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఆ శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రక్రయను చేపట్టింది. ఆ శాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఏడు, పది, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఆ శాఖలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రక్రయను చేపట్టింది. ఆ శాఖలో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఏడు, పది, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మీ లక్ష్యమైతే మీకు ఇదొక సువర్ణావకాశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు ఉద్యోగాల భర్తీకి ప్రక్రియను ప్రారంభించింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కాగా ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనుంది. ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో పలు జిల్లాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ల ద్వారా నర్సు, డాక్టర్, ఆయా,జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, లీగల్ కమ్ ప్రొబేషన్ అధికారి, కౌన్సెలర్, డేటా అనలిస్ట్‌, చౌకీదార్, స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, ఎడ్యుకేటర్‌, వాచ్‌ మెన్,సోషల్‌ వర్కర్‌, అకౌంటెంట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

పోస్టులు భర్తీ చేయనున్న జిల్లాల్లోని మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయాలు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాయి. అయితే ఈ ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి ఏడో తరగతి నుంచి పీజీ ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు అర్హులు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోదలచిన వారు ఆఫ్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులను ఆయా జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం అడ్రస్ కు పంపించాలి.

ఈ పోస్టులకు అప్లయ్ చేసుకునే అభ్యర్థుల వయస్సు 42 ఏళ్లు దాటకూడదు.

జిల్లాల వారీగా పోస్టుల వివరాలు

వైఎస్సార్‌ జిల్లాలో

ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు 17 నవంబర్ 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రకాశం జిల్లాలో

ప్రొటెక్షన్ ఆఫీసర్, సోషల్‌ వర్కర్‌ పోస్టులు భర్తీ చేయనున్నరు. ఈ ఉద్యోగాలకు 22 నవంబర్ 2023 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏలూరు జిల్లాలో..

జిల్లా కోఆర్డినేటర్, బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై, పని అనుభవం ఉన్నవారు నవంబర్ 14, 2023లోపు ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

అల్లూరి సీతారామరాజు జిల్లాలో..

జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ కేర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్స్టిట్యూషనల్ కేర్, లీగల్ కమ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, కౌన్సెలర్, సోషల్ వర్కర్, అకౌంటెంట్, డేటా అనలిస్ట్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఔట్‌రీచ్ వర్కర్స్, మేనేజర్/కోఆర్డినేటర్ (మహిళలు), సోషల్ వర్కర్ కాం- ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్ (మహిళ), నర్సు (మహిళ), డాక్టర్ (పార్ట్ టైమ్), ఆయా (ఆడ), చౌకీదార్ (మహిళ).. పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ నవంబర్ 16, 2023.

అన్నమయ్య జిల్లాలో..

జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ కేర్, ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్స్టిట్యూషనల్ కేర్, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్, కౌన్సెలర్, సోషల్ వర్కర్, అకౌంటెంట్, డేటా అనలిస్ట్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఔట్‌రీచ్ వర్కర్స్, మేనేజర్/కోఆర్డినేటర్ (మహిళ), సోషల్ వర్కర్ కాం-ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్ (ఫిమేల్), నర్సు (మహిళ), డాక్టర్ (పార్ట్ టైమ్), ఆయా (మహిళ), చౌకీదార్.. పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ నవంబర్ 20, 2023.

పార్వతీపురం మన్యం జిల్లాలో..

ప్రొటెక్షన్ ఆఫీసర్, లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్, కౌన్సెలర్, సోషల్ వర్కర్, అకౌంటెంట్, డేటా అనలిస్ట్, అవుట్‌రీచ్ వర్కర్స్, మేనేజర్/కోఆర్డినేటర్ (మహిళ), నర్సు (మహిళ), సోషల్ వర్కర్ కమ్ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్ (మహిళ), డాక్టర్ (పార్ట్ టైమ్), ఆయా (మహిళ), చౌకీదార్ (మహిళ), ఆఫీసర్-ఇన్-ఛార్జ్ (సూపరింటెండెంట్), స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్, పిటి ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్, అధ్యాపకుడు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్, కుక్, హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్, హౌస్‌కీపర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 23 నవంబర్ 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

Show comments