AP డీఎంఈలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు.. నెలకు రూ. లక్షన్నర వరకు జీతం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాలల్లోని వివిధ స్పెషాలిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాలల్లోని వివిధ స్పెషాలిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. ఇప్పటికే గ్రూప్ 2 తోపాటు పలు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో నోటిఫికేషన్ ను విడుదల చేసింది ఏపీ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఆధ్యర్యంలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రభుత్వ ఆస్పత్రి, వైద్య కళాశాలల్లోని వివిధ స్పెషాలిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 144 అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ నేడు అనగా 08-12-2023 నుంచి ప్రారంభమైంది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి విరాల కోసం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్ ను https://dme.ap.nic.in. పరిశీలించాలని కోరింది.

ముఖ్యమైన సమాచారం:

  • ఏపీ డీఎంఈలో అసిస్టెంట్ ప్రఫొసెర్ ఉద్యోగాలు

మొత్తం ఖాళీలు:

  • 144

అర్హత:

  • అభ్యర్థులు ఎంసీఐ లేదా ఎంఎన్సీ చేత గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి మెడికల్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ(డీఎం/ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ/డీఎంఏ) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • ఓసీ అభ్యర్థులు నోటిఫికేషన్ తేదీ నాటికి 42 సంవత్సరాలు లోపు ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్య్లూఎస్ అభ్యర్థులు 47 సంవత్సరాల లోపు ఉండాలి.
  • దివ్యాంగులు 52 సంవత్సరాల లోపు ఉండాలి.
  • ఎక్స్ సర్వీస్ మెన్స్ 50 సంవత్సరాల లోపు ఉండాలి.

ఎంపిక విధానం:

  • మెరిట్ లిస్ట్, డాక్యుమెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు:

  • ఓసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈడబ్య్లూఎస్, పీహెచ్ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.

వేతనం:

  • ఎంపికైన వారికి నెలకు రూ. 65 వేల నుంచి రూ. 1,54,000 వరకు చెల్లిస్తారు.

వాకిన్ ఇంటర్య్వూ తేదీలు:

  • డిసెంబర్ 18 నుంచి 20, 2023 వరకు. అభ్యర్థులు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఓల్డ్ జీజీహెచ్ క్యాంపస్, హనుమాన్ పేట, విజయవాడలో హాజరు కావాల్సి ఉంటుంది.

అప్లికేషన్ ప్రారంభ తేదీ:

  • 08-12-2023

ఏపీ డీఎంఈ అధికారిక వెబ్ సైట్:

Show comments