ఇ-కామర్స్ లో 10 లక్షల ఉద్యోగాలు.. మీరూ ట్రై చేయండి

E-Commerce Companies: ఉద్యోగం లేదని టెన్షన్ పడుతున్నారా? ఇ కామర్స్ సంస్థల్లో భారీగా ఉద్యోగాలు భర్తీకానున్నాయి. ఏకంగా 10 లక్షల ఉద్యోగాలు నియమించుకునేందుకు రెడీ అవుతున్నాయి.

E-Commerce Companies: ఉద్యోగం లేదని టెన్షన్ పడుతున్నారా? ఇ కామర్స్ సంస్థల్లో భారీగా ఉద్యోగాలు భర్తీకానున్నాయి. ఏకంగా 10 లక్షల ఉద్యోగాలు నియమించుకునేందుకు రెడీ అవుతున్నాయి.

శ్రావణమాసం ఆరంభంతో శుభకార్యాలు, పండుగల సీజన్ ప్రారంభమైంది. ఈ సమయంలో ప్రజలు తమకు కావాల్సిన వస్తువులను కొనగోలు చేస్తుంటారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, హోమ్ నీడ్స్, ఇంకా ఇతర వస్తువులు ఇబ్బడిముబ్బడిగా పర్చేజ్ చేస్తుంటారు. ఇటీవల చాలామంది ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ల ద్వారానే కొంటున్నారు. ప్రముఖ ఈకామర్స్ సంస్థలు యూజర్లకు అవసరమైన ప్రొడక్ట్స్ ను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇక వరుస పండగల నేపథ్యంలో సేల్స్ పెరగనున్నాయి. డిమాండ్ కు తగ్గట్టుగా గిగ్ వర్కర్లను, కాంట్రాక్ట్ సిబ్బందిని ఇ-కామర్స్ సంస్థలు నియమించుకునే అవకాశం ఉందని టీమ్ లీజ్ సర్వీసెస్ సంస్థ వెల్లడించింది. ఏకంగా 10 లక్షల ఉద్యోగాలు భర్తీకానున్నట్టు తెలుస్తోంది.

జాబ్ సెర్చ్ లో ఉన్నవారికి గుడ్ న్యూస్. ఇ-కామర్స్ సంస్థల్లో 10 లక్షల జాబ్స్ భర్తీకానున్నాయి. మీరూ ట్రై చేయొచ్చు. పండగల సీజన్ లో అమ్మకాలు 35 శాతం పెరగొచ్చని ఇ-కామర్స్‌ పరిశ్రమ అంచనా వేస్తోందని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు, బిజినెస్‌ హెడ్‌ బాలసుబ్రమణియన్‌ పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 10 లక్షల గిగ్‌ కార్మికులు, 2.5 లక్షల మంది కాంట్రాక్టు సిబ్బందిని ఇ-కామర్స్‌ సంస్థలు నియమించుకునే అవకాశం ఉందని టీమ్ లీజ్ సర్వీసెస్ తెలిపింది. వివిధ కేటగిరీల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది.

పండగల సీజన్ లో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు తమ ప్రొడక్టులపై డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటాయి. ఈ సమయంలో సేల్ ఎక్కువ జరుగుతుంది. కస్టమర్ల ఆర్డర్లతో సంస్థల్లో ఫుల్ గిరాకీ ఉంటుంది. సేల్ డిమాండ్ కు తగ్గట్టుగా ఎంప్లాయిస్ ను నియమించుకునేందుకు ఈ కామర్స్ సంస్థలు రెడీ అవుతున్నాయి. తాత్కాలిక ఉద్యోగాల రూపంలో ఇ-కామర్స్‌ రంగం భారీగా కొలువులు సృష్టించనుంది. గిగ్‌ ఉద్యోగాల్లో డెలివరీ వ్యక్తులు, గోదాము కార్మికులు, కస్టమర్‌ సేవల ప్రతినిధులు, ప్యాకేజింగ్, లేబులింగ్, క్వాలిటీ కంట్రోల్, ఆర్డర్‌ పుల్‌ఫిల్‌మెంట్‌ వంటివి ఉన్నాయి.

Show comments