Nidhan
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఒకరితో పోటీపడి ఒకరు ఆడుతున్నారు. విధ్వంసక బ్యాటింగ్‌తో ముంబై బౌలర్లను ఊచకోత కోస్తున్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఒకరితో పోటీపడి ఒకరు ఆడుతున్నారు. విధ్వంసక బ్యాటింగ్‌తో ముంబై బౌలర్లను ఊచకోత కోస్తున్నారు.
Nidhan
సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు ఒకరితో పోటీపడి ఒకరు ఆడుతున్నారు. విధ్వంసక బ్యాటింగ్‌తో ముంబై బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. తొలి మ్యాచ్‌లో కొద్దిలో ఓడిపోవడంతో కసి మీద ఉన్న ఎస్ఆర్హెచ్.. ముంబై మీద తన ప్రతాపం చూపిస్తోంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు సూపర్బ్ స్టార్ట్ దొరికింది. మయాంక్ అగర్వాల్ (11) త్వరగా ఔటైనా.. ట్రావిస్ హెడ్ (24 బంతుల్లో 62) థండర్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకొని ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన ఎస్ఆర్హెచ్ బ్యాటర్‌గా నిలిచాడు హెడ్. అయితే ఆ రికార్డు కొద్దిసేపే నిలిచింది. అతడికి తోడుగా అదరగొడుతున్న అభిషేక్ శర్మ (23 బంతుల్లో 63) హెడ్ రికార్డును తుడిపేశాడు. 16 బంతుల్లోనే ఫిప్టీ రన్స్ బాదేశాడు అభిషేక్. హెడ్‌ను మించిన బ్యాటింగ్ విధ్వంసం అతడిది.
డొమెస్టిక్ క్రికెట్లో అదరగొడుతున్న అభిషేక్ శర్మ.. ఐపీఎల్లో రెండో మ్యాచ్‌లోనే తన సత్తా ఏంటో చూపించాడు. ఈ మ్యాచ్‌లో 3 బౌండరీలు బాదిన అతడు మొత్తం సిక్సుల్లోనే డీల్ చేశాడు. ఏకంగా 7 భారీ సిక్సులు బాదాడతను. కొత్త బౌలర్ మఫాకాతో పాటు సీనియర్ స్పిన్నర్ పీయుష్ చావ్లాను టార్గెట్ చేసుకొని హిట్టింగ్‌కు దిగాడు అభిషేక్. హెడ్ ఆడుతున్నంత సేపు కూల్‌గా ఆడిన ఈ యంగ్ బ్యాటర్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హిట్టింగ్ చేసే రెస్పాన్సిబిలిటీని తీసుకున్నాడు. సిక్సులు కొట్టడమే పనిగా పెట్టుకొని ముంబై బౌలర్లకు ఓ రేంజ్లో పోయించాడు.
A STANDING OVATION BY HYDERABAD CROWD FOR THE 23 YEAR OLD ABHISHEK SHARMA. pic.twitter.com/mRYRlRLiL5
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 27, 2024