Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గట్టి ప్లానింగ్‌తో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ టీమ్ విషయంలో అతడి వ్యూహాలు చాలా షాకింగ్‌గా ఉన్నాయి.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గట్టి ప్లానింగ్‌తో ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్ టీమ్ విషయంలో అతడి వ్యూహాలు చాలా షాకింగ్‌గా ఉన్నాయి.
Nidhan
ఐపీఎల్-2024లో దాదాపుగా ప్రతి మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. దీంతో అందరూ క్యాష్ రిచ్ లీగ్ మ్యాచుల్ని చూడటంలో బిజీ అయిపోయారు. ఆటగాళ్లు కూడా తమ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆయా టీమ్స్‌ను గెలిపించాలని చూస్తున్నారు. అయితే ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మాత్రం టీ20 వరల్డ్ కప్ ప్లానింగ్‌లో ఉన్నాడు. ముంబైకి ఆడుతూనే మరోవైపు ప్రపంచ కప్ గురించి కూడా టీమిండియా కెప్టెన్ ఆలోచిస్తున్నాడని తెలుస్తోంది. ఏయే ప్లేయర్లను జట్టులోకి తీసుకోవాలి? టీమ్ కాంబినేషన్ ఎలా ఉండాలి? అనేది ప్లానింగ్ చేస్తున్నాడట. కోచ్ ద్రవిడ్‌తో పాటు బీసీసీఐ పెద్దలతోనూ టచ్‌లో ఉంటున్నాడని సమాచారం. వన్డే వరల్డ్ కప్ మిస్సయిందన్న బాధలో ఉన్న హిట్‌మ్యాన్.. టీ20 ప్రపంచ కప్ కొట్టాలని బలంగా అనుకుంటున్నాడట. అయితే ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు అతడు షాక్ ఇవ్వనున్నాడని వినిపిస్తోంది.
టీ20 ప్రపంచ కప్‌కు వెళ్లబోయే భారత జట్టును త్వరలో ప్రకటించనున్నారు. టీమ్‌తో ట్రావెల్ అవుతున్న ప్లేయర్లు అందరికీ స్క్వాడ్‌లో ప్లేస్ పక్కా అని తెలుస్తోంది. అయితే ఆల్‌రౌండర్ హార్దిక్‌కు మాత్రం జట్టులో చోటు దక్కదని సమాచారం. అతడి ప్లేస్‌లో యంగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబెను సెలక్ట్ చేయనున్నారట. ఈ మేరకు రోహిత్ బోర్డుకు సూచనలు చేశాడని టాక్ నడుస్తోంది. హార్దిక్‌ను పక్కనబెట్టడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. గాయం కారణంగా వన్డే వరల్డ్ కప్ నుంచి టీమ్‌కు దూరంగా ఉన్న పాండ్యా ఐపీఎల్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చాడు. కానీ ఇప్పటిదాకా ఆడిన మ్యాచుల్లో అతడు ఆల్‌రౌండర్‌గా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. బ్యాటింగ్ లేదు, బౌలింగ్ కూడా లేదు.
టీ20ల్లో హార్దిక్ ఆడేది కీలకమైన స్థానం. ఆఖర్లో వచ్చి మ్యాచుల్ని ఫినిష్ చేయడం అతడి పని. కానీ ఐపీఎల్లో పాండ్యా టోటల్ ఫెయిల్ అవుతున్నాడు. ఇదే సమయంలో శివమ్ దూబె మాత్రం ప్రతి మ్యాచ్‌లో సగటున 20కి పైగా బంతుల్లో 50 పరుగులు కొడుతున్నాడు. అతడు మీడియం పేస్‌తో బ్రేక్ త్రూలు అందించగలడు. కానీ చెన్నై సూపర్ కింగ్స్‌లో ఉన్న ఎక్కువ వనరుల వల్ల అతడికి బౌలింగ్ ఇవ్వడం లేదు. ఇక్కడే రోహిత్ తన ప్లాన్‌ను వాడుతున్నాడు. వరల్డ్ కప్ జరిగేది వెస్టిండీస్‌లో. దీంతో అక్కడ స్లో పిచ్‌లకు స్లో డెలివరీస్ వేసే దూబె పర్ఫెక్ట్గా సరిపోతాడని చెప్పి సెలక్టర్లను ఫోర్స్ చేస్తున్నాడట హిట్‌మ్యాన్.
హార్దిక్ ఫెయిల్యూర్, ఆల్‌రౌండర్‌గా దూబె సక్సెస్, స్లో పిచ్‌లకు స్లో బౌలింగ్ పర్ఫెక్ట్ అంటూ రోహిత్ చెప్పిన లాజిక్కు సెలక్టర్లు కూడా ఓకే అన్నారని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇలా జరిగితే మాత్రం ఒక్క దెబ్బకు రెండు లాభాలు ఉంటాయి. ఒకటి దూబె ఎంట్రీతో టీమ్ బ్యాటింగ్, బౌలింగ్‌లో మరింత డెప్త్ వస్తుంది. అలాగే పాండ్యా మీద పగ తీర్చుకున్నట్లు అవుతుంది. అయితే హార్దిక్ బదులు దూబెను తీసుకుంటారా? లేదా? అనేది సెలక్టర్లు టీమ్ అనౌన్స్ చేశాకే క్లారిటీ వస్తుంది. మరి.. దూబె, పాండ్యాలో ఎవర్ని వరల్డ్ కప్‌లో ఆడిస్తే బెటర్ అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.