Nidhan
టీ20 వరల్డ్ కప్‌కు టైమ్ దగ్గర పడుతోంది. మెగా టోర్నీ మొదలవడానికి ఇంకా రెండు నెలల సమయం కూడా లేదు. ఈ తరుణంలో టీమిండియాకు వేకప్ కాల్.
టీ20 వరల్డ్ కప్‌కు టైమ్ దగ్గర పడుతోంది. మెగా టోర్నీ మొదలవడానికి ఇంకా రెండు నెలల సమయం కూడా లేదు. ఈ తరుణంలో టీమిండియాకు వేకప్ కాల్.
Nidhan
ఇప్పుడు అంతా ఐపీఎల్ జోరు నడుస్తోంది. క్రికెట్ అభిమానులతో పాటు ఆటగాళ్లు, సీనియర్ ప్లేయర్లు అంతా క్యాష్ రిచ్ లీగ్ హడావుడిలోనే ఉన్నారు. ఏయే టీమ్స్ ఎలా ఆడుతున్నాయి? ఎవరు ప్లేఆఫ్స్‌కు వెళ్తారు? ఏ క్రికెటర్ ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాడు? లాంటి వాటి మీదే అంతా ఫోకస్ చేస్తున్నారు. అయితే మరోవైపు టీ20 వరల్డ్ కప్‌కు టైమ్ దగ్గర పడుతోంది. మిగతా జట్లు మెగా టోర్నీ కోసం సిద్ధమవుతున్నాయి. టీ20 టోర్నీలు ఆడుతూ ప్రిపరేషన్స్‌లో బిజీగా ఉన్నాయి. భారత ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్లో ఆడుతున్నారు. మన టీమ్‌కు ఇంకో జట్టుతో మ్యాచ్‌లు ఆడే అవకాశం లేదు. లీగ్ ముగియగానే వరల్డ్ కప్‌కు వెళ్లాలి. అయితే మెగా టోర్నీకి ముందు టీమిండియాకు ఇది వేకప్ కాల్ లాంటిది. ఇప్పుడు మారకపోతే ఇంక అంతే సంగతులు అని చెప్పక తప్పదు.
ఈ ఏడాది జూన్‌లో వరల్డ్ కప్ జరగనుండటంతో అన్ని టీమ్స్ ప్రిపరేషన్స్‌లో బిజీగా ఉన్నాయి. భారత జట్టు ఆటగాళ్లు ఐపీఎల్లో ఆడుతున్నారు. అయితే లీగ్‌లో టీమిండియా ప్లేయర్లు ఆటతీరు బాగోలేదు. ముఖ్యంగా బ్యాటర్లు తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. స్ట్రయిక్ రేట్ ఇప్పుడు పెద్ద వర్రీగా మారింది. రోహిత్ శర్మ, రిషబ్ పంత్, శివమ్ దూబె తప్ప ఎవరూ వేగంగా పరుగులు చేయడం లేదు. ఆరెంజ్ క్యాప్ హోల్డర్ విరాట్ కోహ్లీతో పాటు కేఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ల స్ట్రయిక్ రేట్ 150 లోపే ఉంది. ఐపీఎల్లో ఇంకా ఫస్ట్ స్టేజ్ మాత్రమే ముగిసింది. ఇప్పుడే మనోళ్లు ఇలా ఆడితే ఇవే పిచ్‌లు సెకండాఫ్‌లో ఇంకా స్లో అవుతాయి. ప్లేఆఫ్స్, ఫైనల్స్‌కు మరింత నెమ్మదిస్తాయి. అప్పుడు ఎలా బ్యాటింగ్ చేస్తారు? అనేది అర్థం కావడం లేదు.
ఇదే గేమ్‌ను టీ20 వరల్డ్ కప్‌లో కంటిన్యూ చేస్తే భారత్‌కు కష్టాలు తప్పవు. ఫార్మాట్‌కు తగ్గట్లు దూకుడుగా ఆడకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అందరికంటే ఎక్కువగా కోహ్లీ స్ట్రయిక్ రేట్ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓపెనర్‌గా వస్తున్న విరాట్ ఆఖరి వరకు ఆడుతున్నాడు. అయినా అతడి స్ట్రయిక్ రేట్ 146గానే ఉంది. క్రీజులో కాస్త కుదురుకున్నాక వేగం పెంచి, ఆఖర్లో మరింత దూకుడుగా ఇన్నింగ్స్‌ను ముగించాల్సిన విరాట్ ఆశించినట్లు ఆడట్లేదు. యంగ్‌స్టర్ గిల్, మిడిలార్డర్ బ్యాటర్ రాహుల్ కూడా ఇదే విధంగా ఆడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఈ ఆటతీరుతో టీ20 వరల్డ్ కప్ గెలవడం కష్టమని.. వీళ్లు గేర్లు మార్చి ఐపీఎల్ ముగిసేసరికి టాప్ స్పీడ్‌లో దూసుకెళ్లాలని కోరుకుంటున్నారు. మరి.. భారత బ్యాటర్ల స్ట్రయిక్ రేట్ అంశం మీద మీ ఒపీనియన్‌ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: వీడియో: క్రికెట్ చరిత్రలో విచిత్రమైన ఔట్.. ఇంతకంటే అన్‌లక్కీ బ్యాటర్ ఉండడు!