Nidhan
సన్‌రైజర్స్ విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ ఇచ్చాడు. అతడి హెచ్చరిక గురించి తెలిస్తే ఇది కదరా ఎస్ఆర్హెచ్ దమ్ము అని చెప్పక తప్పదు.
సన్‌రైజర్స్ విధ్వంసక ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ ఇచ్చాడు. అతడి హెచ్చరిక గురించి తెలిస్తే ఇది కదరా ఎస్ఆర్హెచ్ దమ్ము అని చెప్పక తప్పదు.
Nidhan
సన్‌రైజర్స్ హైదరాబాద్ అందర్నీ భయపెడుతోంది. భారీ స్కోర్లు బాదుతూ అపోజిషన్ టీమ్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. వరుస గెలుపులతో ఫుల్ జోష్‌లో ఉన్న కమిన్స్ సేన.. నిన్న ఆర్సీబీని కూడా ఓడించింది. బెంగళూరుపై మ్యాచ్‌లో ఏకంగా 287 పరుగులు చేసి ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచింది. ఇదే సీజన్లో ముంబై ఇండియన్స్ పై బాదిన 277 పరుగుల తన హయ్యెస్ట్ స్కోర్ రికార్డును నిన్నటి మ్యాచ్‌తో చెరిపేసింది. ఈ సీజన్లో ఆర్సీబీ, ముంబైతో పాటు డిఫెండింగ్ ఛాంపియన్‌ను చెన్నై సూపర్ కింగ్స్‌ను కూడా చిత్తు చేసింది ఆరెంజ్ ఆర్మీ. ఆ జట్టు ఊపు చూస్తుంటే టైటిల్ ఎగరేసుకుపోవడం పక్కాగా కనిపిస్తోంది. టీమ్ సక్సెస్‌లో బ్యాటింగ్ యూనిట్‌దే కీలకపాత్ర. అందులోనూ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మెరుపు ఆరంభాలతో అదరగొడుతున్నాడు. అలాంటోడు ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చాడు.
సన్‌రైజర్స్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ నెక్స్ట్ లెవల్ ఫామ్‌లో ఉన్నాడు. ఆడిన 5 మ్యాచుల్లో 199 స్ట్రయిక్ రేట్‌తో 235 పరుగులు చేశాడు. దొరికిన బాల్‌ను దొరికినట్లు బాదడమే పనిగా అతడి బ్యాటింగ్ సాగుతోంది. ఫస్ట్ బాల్ నుంచే బౌలర్లను అతడు ఊచకోత కోస్తున్నాడు. నిన్న ఆర్సీబీతో మ్యాచ్‌లోనూ విధ్వంసక ఇన్నింగ్స్‌తో మెరిశాడు హెడ్. 41 బంతుల్లో 102 పరుగులతో రికార్డ్ స్కోర్‌కు బాటలు వేశాడు. అలాంటోడు మ్యాచ్ ముగిసిన తర్వాత అపోజిషన్ టీమ్స్‌కు వార్నింగ్ ఇచ్చాడు. తనతో పాటు మరో ఓపెనర్ అభిషేక్ శర్మ దూకుడుగా ఆడేందుకు ఫ్రీడమ్ ఇచ్చిన కెప్టెన్ కమిన్స్‌కు అతడు థ్యాంక్స్ చెప్పాడు. అలాగే కోచ్ డానియల్ వెటోరికి కూడా క్రెడిట్ ఇచ్చాడు. ఆ తర్వాత నెక్స్ట్ జరిగే మ్యాచుల్లో ఎలా ఆడనున్నాడో చెప్పాడు.
‘నాతో పాటు మరో ఓపెనర్ అభిషేక్ శర్మను అటాకింగ్ మోడ్‌లో ఆడేందుకు కమిన్స్, వెటోరి స్వేచ్ఛ కల్పించారు. ఇప్పుడు మా ముందున్న టార్గెట్ 300 పరుగులు. మిడిలార్డర్లో హెన్రిక్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డితో కూడిన పవర్ హిట్టింగ్ యూనిట్ ఉంది. కాబట్టి ఈ లక్ష్యాన్ని అందుకుంటాం’ అంటూ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు హెడ్. ఇది చూసిన నెటిజన్స్.. ఎస్ఆర్హెచ్ను తక్కువ అంచనా వేయొద్దని, ఇది సాధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అంటున్నారు. ఇరవై రోజుల గ్యాప్‌లో 270 ప్లస్ స్కోర్లు రెండుసార్లు బాదిన టీమ్.. 300 కొట్టడం ఏమంత కష్టం కాదని చెబుతున్నారు. ఎస్ఆర్హెచ్ అంటార్రా బాబు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఆరెంజ్ ఆర్మీ కొత్త టార్గెట్ రీచ్ అవుతుందని భావిస్తే కామెంట్ చేయండి.
SRH’s next target: 300+ 🎯
Bowlers be scared, be very scared! 👀#RCBvsSRH #IPL2024 #TravisHead pic.twitter.com/UD7v7bNvkN
— OneCricket (@OneCricketApp) April 16, 2024